Home » Entertainment » Varsha And Emmanuel Uppena Spoof In Jabardasth
Entertainment

Varsha : రెచ్చిపోయిన ఇమాన్యుయేల్ వర్ష.. ‘ఉప్పెన’ ‘జలపాతం’తో రచ్చ

Authored By
aruna
The Telugu News | Published on: October 25, 2021, 8:20 pm
Advertisement

Varsha  ఉప్పెన సినిమా ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో కొన్ని పాటలు, కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్ అవుతాయి. జరం కావాలా? అనే డైలాగ్ ఎంత రొమాంటిక్‌గా ఉంటుందోవ అందరికీ తెలిసిందే. ఇక జల జల జలపాతం అనే పాటలో రొమాన్స్ పీక్స్‌లో ఉంటుంది.అలాంటి రొమాన్స్‌ను బుల్లితెరపై వర్ష, ఇమాన్యుయేల్ పండించేందుకు వచ్చారు.

Advertisement

Varsha And Emmanuel Uppena Spoof In Jabardasth

వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. అందులో బేబమ్మగా వర్ష, ఆశిగా ఇమాన్యుయేల్ నటించారు. ఈ జోడి నటించమంటే జీవించినట్టు కనిపిస్తోంది. జరం కావాలా? అంటూ వర్ష కొంటెగా అడిగింది. కావాలి అని ఇమాన్యుయేల్అన్నాడు. అలా దగ్గరకు వచ్చిన వర్ష.. రెండు ఉల్లిపాయలను తీసి ఇవ్వడంతో రోజా కౌంటర్ వేసింది.

Advertisement

Varsha  వర్ష ఇమాన్యుయేల్ రొమాన్స్

Varsha And Emmanuel Uppena Spoof In Jabardasth

జల జల జల పాతం అనే పాటకు ఇద్దరూ రొమాన్స్ చేశారు. హగ్గులతో ఈ ఇద్దరూ బాగానే రెచ్చిపోయారు. మొత్తానికి పర్ఫామెన్స్‌ ఏమో గానీ ఈ ఇద్దరి జోడి మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కేసింది. కానీ ఆ స్కిట్‌లో వర్ష వెళ్లిపోయి.. ఫైమా ఎంట్రీ ఇవ్వడంతో స్కిట్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. రోజా కూడా చివరకు అదే మాట అంది. వర్షతో నీ ట్రాక్ సెట్ అవుతుందని అనుకుంటే మధ్యలో ఫైమా వచ్చిందని రోజా కామెంట్ చేసింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి