
సినీ సెలబ్రిటీల పెళ్లిల్లైనా, పుట్టిన రోజులైనా నెట్ ఇంట్లో అన్ని బ్రేకింగ్ న్యూస్ లే. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రత్యేక రోజుల్లో వీరికి ఉండే క్రేజే వేరు. లేటెస్ట్ గా మెగా డాటర్ కు సంబంధించిన న్యూస్ లు సోషల్ మీడియాలో సెన్‌సేషనల్ అవుతున్నాయనే చెప్పాలి. ఇటీవల నిశ్చయ్ డెస్టినేషన్ వెడ్డింగు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ తో పాటు మెగా ఫ్యాన్స్ దృష్ఠి మొత్తం మెగా డాటర్ పెళ్ళి మీదే ఉండింది. నిశ్చయ్ జంటకు అభిమానుల నుంచి ఎంతో ఆధరణ లభించింది. కుమారిగా తన సోలో లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి శ్రీమతిగా తన మొట్టింట్లో మొదటి పుట్టిన రోజును జరుపుకుంటోంది నిహారిక. దీంతో తన ప్రియసఖుడితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విషెస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
నిహాతో తమకున్న అనుబంధాన్ని క్యూట్ క్యూట్ విషెస్ తో రివీల్ చేస్తున్నారు. పెళ్లి తరువాత మొదటి పుట్టినరోజు కావడంతో నిహా తన బర్త్‌డేన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది…భర్త చైతన్యతో కలిసి ఫలక్‌నమా ప్యాలెస్ లో బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది నిహా. ఈ క్రమంలో తన లవ్లీ బ్రదర్ వరుణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషెస్‌తో ఉబ్బితబ్బిబైంది నిహా.. నువ్వు అప్పుడే ఇంత పెద్దదానివి అయ్యావంటే నమ్మలేకపోతున్నానని, అయినా..కూడా నువ్వు నాకు ఎప్పటికీ చిన్న పిల్లవేనని వరుణ్ ట్వీట్ చేశాడే. అలాగే.. నువ్వు నీ చుట్టూ ఉన్న వారిలో ఎప్పుడు ఆనందాన్ని నింపుతూ వచ్చావని , నీవు నా జీవితంలో ఉన్నందుకు నేను ఎంతో లక్కీ అంటూ…హ్యాపీ బర్త్ డే బంగారు తల్లి అంటూ ఎంతో భాగోద్వేగమైన పోస్ట్ చేశాడు వరుణ.
వరుణ్ ఈ ట్వీట్ ను చూసిన నిహా…బంగారు కొండ ఐ లవ్ యూ సో మచ్ అంటూ స్పందించింది. ఈ ఇద్దరి అన్నా చెల్లెల్ల ట్వీట్‌లు నెట్టింట్లోని వారిని ఎమోషనల్ గా కనెక్ట్ చేశాయి. నిజానికి నిహా పెళ్లి సమయంలో వరుణ్ అన్నీ తానై దగ్గరుండి పెద్ద బాధ్యతను నిర్వర్తించాడు. ఎంతో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేశాడు. తన చిట్టి చెల్లికి ఎక్కడ ఏ తక్కువ జరుగుకుండా కన్నతండ్రిలా చూసుకున్నాడు. ఎంతైనా అన్నా చెల్లెల్ల అనుబంధం అంటే ఇదేరా అనిపించేలా ఉన్నారు ఈ అన్నా, చెల్లెల్లు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.