Home » Entertainment » Varun Tej Comments About Love With Lavanya Tripathi
Entertainment

Varun Tej – Lavanya Tripathi : మొదటిసారి తమ ప్రేమ పెళ్లి గురించి చెప్పిన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ..!!

Authored By
aruna
The Telugu News | Published on: August 19, 2023, 10:00 am
Advertisement

Varun Tej – Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో జూన్ 9న ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరగనుంది. అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన ‘ గాండీవాధారి అర్జున ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడారు. దాదాపుగా అయిదారేళ్ల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం, తను నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఏమి ఇష్టమో తనకు బాగా తెలుసు.

Advertisement

మా ఇద్దరి అభిరుచులు కలవడంతో నేనే మొదటగా లావణ్య కు ప్రపోజ్ చేశాను అని చెప్పుకొచ్చాడు మెగా హీరో వరుణ్ తేజ్. అంతేకాకుండా తను ప్రెసెంట్ యూజ్ చేస్తున్నా మొబైల్ ఫోన్ కూడా లావణ్య నే గిఫ్ట్ గా ఇచ్చింది అంటూ ఎంగేజ్మెంట్ లాగానే మ్యారేజ్ కూడా సింపుల్ గా జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం లావణ్య వరుణ్ తో పాటే బ్రేక్ ఫాస్ట్ కి వెళ్లిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Varun Tej comments about love with Lavanya Tripathi

Advertisement

ఆ ఫోటోలు చూసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంజాయ్ యువర్ డే , బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా లావణ్య, వరుణ్ తమ ఎంగేజ్మెంట్ అయిన దాకా వారిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని ఎక్కడ బయటికి తీసుకురాలేదు. వారి ఎంగేజ్మెంట్ తర్వాతే అందరికీ తెలిసింది వీరిద్దరూ ప్రేమించుకున్నారని. అంత సీక్రెట్ గా తమ ప్రేమను దాచేశారు. మొత్తానికి అయితే పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవదారి అర్జున సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి