Venkatesh : మహేష్, పవన్ గురించి వెంకటేష్ చెప్పిన ఈ విషయాలు తెలుసా.. ఫ్యాన్స్ కి పండగే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venkatesh : మహేష్, పవన్ గురించి వెంకటేష్ చెప్పిన ఈ విషయాలు తెలుసా.. ఫ్యాన్స్ కి పండగే..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Venkatesh : మహేష్, పవన్ గురించి వెంకటేష్ చెప్పిన ఈ విషయాలు తెలుసా.. ఫ్యాన్స్ కి పండగే..!

Venkatesh : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న వెంకటేష్ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా చెప్పాడు. వెంకటేష్ ఎప్పుడు ఇలా ఇంటర్వ్యూలకు వచ్చింది లేదు కాబట్టే ఇలా ఈ ఎపిసోడ్ కి ఇంత క్రేజ్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ చాలా ఓపెన్ అయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే బాలయ్య మహేష్, పవన్ లతో తన రిలేషన్ గురించి అడిగాడు. దానికి ఆన్సర్ గా మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశా ఆ టైం లో చాలా దగ్గరయ్యామని అన్నాడు. అంతేకాదు మహేష్ అందరికీ ఒకేలా మర్యాద ఇస్తాడు. మహేష్ సినిమాలో పూలకుండి తంతాడు. ఏరా పూల కుండి ఎందుకు తన్నావ్ అని అప్పుడప్పుడు మెసేజ్ పెడతా. బయట కూడా తనకు మహేష్ తమ్ముడిలా భావిస్తా. ఈమధ్య మెసేజ్ చేశా కానీ తన నుంచి రెస్పాన్స్ రాలేదని అన్నాడు వెంకటేష్. తనతో పనిచేయడం బాగా అనిపించిందని అన్నారు.

Venkatesh మహేష్ పవన్ గురించి వెంకటేష్ చెప్పిన ఈ విషయాలు తెలుసా ఫ్యాన్స్ కి పండగే

Venkatesh : మహేష్, పవన్ గురించి వెంకటేష్ చెప్పిన ఈ విషయాలు తెలుసా.. ఫ్యాన్స్ కి పండగే..!

Venkatesh ఇద్దరం చాలా సైలెంట్ గా ఉంటాం..

ఇక పవన్ గురించి చెబుతూ సినిమా చేయడానికి ముందు పవన్ తో పరిచయం ఉంది. అతను తన దగ్గర ఉన్న లేజర్ డిస్క్ ల కోసం వస్తాడు. పవన్ తో తనకు ఆధ్యాత్మికత టచ్ ఎక్కువ. మేమిద్దరం కలిస్తే వాటి గురించి మాట్లాడుకుంటామని అన్నాడు. అంతేకాదు ఇద్దరం చాలా సైలెంట్ గా ఉంటాం అందుకే అంత బాగా కనెక్ట్ అయ్యామని అన్నారు వెంకటేష్. పవన్ తో వెంకటేష్ గోపాల గోపాల సినిమా చేసిన విషయం తెలిసిందే.

ఇదే కాదు తన వారసుడు అర్జున్ కి ఏది అవ్వాలని ఉంటే అది అవుతాడని. ఐతే తాను మాత్రం అతని మీద ఫోర్స్ చేయనని అన్నారు వెంకటేష్. ఇక రామానాయుడితో చివరగా ఒక సినిమా చేయాలని అనుకోగా అది కుదరలేదని. అంతేకాదు ఆయన ఎంపీగా కూడా అవ్వాలని అనుకున్నారు ఆ కోరిక కూడా తీరలేదని చెప్పుకొచ్చారు. వెంకటేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్ షో చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది