Venkatesh : విక్టరీ వెంకటేష్ కోసం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ .. ‘అబ్బాయి గారు 60+’ టైటిల్ ఫిక్స్!
ప్రధానాంశాలు:
Venkatesh : విక్టరీ వెంకటేష్ కోసం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ .. ‘అబ్బాయి గారు 60+’ టైటిల్ ఫిక్స్!
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్‌కి సిగ్నేచర్ బ్రాండ్‌గా నిలిచిన వెంకీకి సరిగ్గా తగినట్టుగా, పూర్తిగా కామెడీ నేపథ్యంలో సాగే ఓ కథ ఫైనల్ అయిందని ఫిలింనగర్ టాక్. ఈ సినిమా టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది .. ఆ టైటిల్ ‘అబ్బాయి గారు 60+’.

Venkatesh : విక్టరీ వెంకటేష్ కోసం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ .. ‘అబ్బాయి గారు 60+’ టైటిల్ ఫిక్స్!
Venkatesh ఆసక్తి పెంచుతున్న టైటిల్.
వయసు మీద పడ్డా… వయసుకు మించిన ఎనర్జీతో, స్టైల్‌తో, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక వ్యక్తి చుట్టూ నడిచే కథ ఇది. ఫ్యామిలీ కామెడీ, నవ్వులు పంచే పంచ్‌లతో పాటు సోషల్ టచ్ కూడా ఇందులో ఉండబోతోందని సమాచారం.ఈ ప్రాజెక్టును ఒక ప్రముఖ యువ దర్శకుడు రూపొందించబోతున్నాడని టాక్.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి దశలో ఉంది. త్వరలోనే అధికారికంగా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.
వెంకటేష్ చివరిసారిగా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే జోష్‌లో పలు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనుండగా, దాంతో పాటు చిరుతో ఓ చిత్రం, బాలయ్యతో ఓ చిత్రం చేయనున్నాడట. అబ్బాయిగారు 60+ చితత్రం వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు ఇది మళ్లీ బెస్ట్ కంబ్యాక్ అవుతుందేమో అని అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు.