Home » Entertainment » Venkatesh Making Hilarious Fun On Rana Acting
Entertainment

Rana – Venkatesh : నీకో దండం.. నా పరువు తీయకు.. వెంకటేష్ దెబ్బకు దండం పెట్టేసిన రానా..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 8, 2023 8:35 pm
Advertisement

Rana – Venkatesh : నెట్ ఫ్లిక్స్ లో వెంకటేష్ రానా నటించిన “రానా నాయుడు” వెబ్ సిరీస్ ఈనెల 10వ తారీఖు నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా నిర్వహిస్తున్నారు. హిందీ తో పాటు తెలుగు ఇంకా పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తండ్రి కొడుకులు గా రానా వెంకటేష్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్, మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూనే మరో పక్క కామెడీ పండించడంతో పక్కనే ఉన్న రానా దండం పెట్టేసాడు. రానా తనకి కొత్త ప్రపంచం అని తెలియజేశారు.

Advertisement

Venkatesh Making Hilarious Fun On Rana Acting

ఫస్ట్ టైం ఓటీటీలో నటించడం జరిగిందని తెలిపారు. ఇందులో భావోద్వేగా సన్నివేశాలు చాలా కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటాయి. పైగా మొదటిసారి రానాతో ఫుల్ లెన్త్ స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో నాగ నాయుడు పాత్రలో కనిపిస్తున్నట్లు… చాలా కొత్తగా ఉంటుందని వెంకటేష్ తెలియజేశారు. ఇదే సమయంలో రానా మాట్లాడుతూ… తెలుగులో ప్రయోగాలు చేయటంలో ఎప్పుడూ తాను ముందున్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ వెబ్ సిరీస్ ద్వారా కూడా

Advertisement

Venkatesh Making Hilarious Fun On Rana Acting

కొత్త ప్రయోగం చేసినట్లు స్పష్టం చేశారు. తెలుగులో పాటలు ఫైట్లు లేకుండా సినిమాలు చేస్తే ఎవరు చూస్తారు అని అనే వాళ్ళు నా మొదటి సినిమా లీడర్ లో అసలు డాన్సులకు సంబంధించిన పాటలు ఫైట్లు ఉండవు అందరూ చూశారు. హీరో టాకీ షో చేస్తే ఎవరు చూస్తారని…అన్నారు. కానీ “నెంబర్ వన్ యారి” అనే టాకీ షో నేను చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది టాకీ షో చేస్తున్నారు. అదేవిధంగా ఈ వెబ్ సిరీస్ కూడా రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి కొంతమంది అగ్ర హీరోలను తీసుకొచ్చే విధంగా ఉంటుందని రానా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి