
venkatesh response TO samantha naga chaitanya divorce
Venkatesh : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే, సమంత, నాగచైతన్య విడిపోవడం పట్ల అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కినేని నాగార్జున సైతం తన గుండె బరువెక్కిందంటూ ట్వీట్ చేశాడు.ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత విడాకులపై సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా నాగచైతన్య మేనమామ విక్టరీ వెంకటేశ్ కూడా స్పందించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
venkatesh response TO samantha naga chaitanya divorce
ఇన్ స్టా గ్రామ్ వేదికగా విక్టరీ వెంకటేశ్ ఓ స్టోరి షేర్ చేయగా, అది నాగచైతన్య, సమంత విడాకులను ఉద్దేశించినదేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే, విక్టరీ వెంకటేశ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్టును గంట లోపలనే డిలీట్ చేయడం గమనార్హం. ఇకపోతే వెంకటేశ్ సదరు పోస్టులో ఏమని పేర్కొన్నాడంటే..మనం నోరు విప్పే ముందు మనసు విప్పి ఆలోచించాలి అని తెలిపాడు. అయితే, ఆ పోస్టును వెంటనే అనగా గంట తర్వాత డిలీట్ చేసి ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్నాడు విక్టరీ వెంకటేశ్. ఇకపోతే విక్టరీ వెంకటేశ్ చాలా సార్లు ఇంటర్వ్యూల్లో తనకు నాగచైతన్య అంటే చాలా ఇష్టమని చెప్పాడు. నాగచైతన్యతో వెంకటేశ్ ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటించాడు.
reasons behind samantha naga chaitanya divorce
బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య తెరపైన వెంకటేశ్‌కు మేనల్లుడిగా నటించాడు. ఇక ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా బ్యూటిఫుల్ రాశి ఖన్నా నటించగా, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించింది. ఈ సంగతులు ఇలా ఉంచితే.. అక్కినేని నాగచైతన్యతో సమంత విడిపోవడానికి గల కారణాలేంటి? అని సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబ సభ్యులు సమంతకు రూ.250 నుంచి రూ.300 కోట్లు భరణంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, భరణం తీసుకునేందుకు సమంత నిరాకరించినట్లు కూడా తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘ఎఫ్ 3’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ‘ఎఫ్ 2’ కు సీక్వెల్.
Samanta Naga chaitanya New update
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.