Venu Swamy : బాబోయ్.. వేణుస్వామి గెటప్ చూశారా.. ఇలా మారిపోయాడేంటి.. వీడియో..!
ప్రధానాంశాలు:
Venu Swamy : బాబోయ్.. వేణుస్వామి గెటప్ చూశారా.. ఇలా మారిపోయాడేంటి.. వీడియో..!
Venu Swamy : సినిమా ఇండస్ట్రీలో నటులు ఎంత ఫేమస్సో.. తెలుగు ఇండస్ట్రీలో వేణుస్వామి కూడా అంతే ఫేమస్. ఆయన ఏమీ నటుడు కాకపోయినా.. అంతకన్నా ఎక్కువగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. చాలా కాలంగా ఆయన ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరు సంపాదించుకున్నాడు. అందులోనూ సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూనే ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పిన వాటిల్లో కూడా చాలానే జరిగాయండోయ్. అదేంటో గానీ.. అందరికంటే ముందే వేణుస్వామి స్టార్ల జ్యోతిష్యం చెప్పేవాడు. ఫలానా స్టార్ హీరోకు పలానా అవుతుందని ఆయన చెబితే చాలా వరకు జరిగాయి.
Venu Swamy వేణుస్వామి భార్యతో కలిసి ఓ రీల్
అందులో చూసుకుంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం సమంత, నాగచైతన్య విడాకుల విషయమే. సమంత, చైతన్య పెళ్లి కుదిరినప్పుడు వేణుస్వామి వారికి విడాకులు అవుతాయి.. పెళ్లిచేసుకోవడం వేస్ట్ అని చెప్పాడు. కానీ వారు మాత్రం వినకుండా పెళ్లి చేసేసుకున్నారు. వేణుస్వామి చెప్పినట్టే నాలుగేళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచే వేణుస్వామికి బాగా క్రేజ్ పెరిగిపోయింది. దాని తర్వాత 40 ఏళ్ల హీరో గుండెపోటుతో చనిపోతాడని చెప్పాడు. ఆయన చెప్పినట్టే తారకరత్న హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు.

Venu Swamy : బాబోయ్.. వేణుస్వామి గెటప్ చూశారా.. ఇలా మారిపోయాడేంటి.. వీడియో..!
ఇక హీరోయిన్లకు స్టార్ డమ్ రావడం కోసం ఎన్నో పూజలు చేస్తుంటాడు వేణుస్వామి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సినీ సెలబ్రిటీల జీవితాల గురించి చెబుతుంటాడు. అయితే ఆయన ఎప్పుడూ ఓ లుంగీ కట్టుకుని ఉండేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన గెటప్ చేంజ్ చేశాడు. తన భార్యతో కలిసి ఓ రీల్ కూడా చేసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మిర్చి సినిమాలోని ఓ సీన్ కు వారిద్దరూ కలిసి నటించారు. అనుష్క, ప్రభాస్ మధ్య జరిగే సీన్ అది. అయితే ఇందులో వేణుస్వామి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ఎప్పటిలాగా లుంగీ, ఓ అంగీ వేసుకోకుండా కాస్త మాడ్రన్ డ్రెస్ వేసుకుని కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన స్పెట్స్ కూడా పెట్టుకున్నాడండోయ్. ఇలా ఆయన మాడ్రన్ లుక్ లో కనిపించేసరికి అంతా ఫిదా అవుతున్నారు. ఇదేం గెటప్ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Dey వేణు స్వామి????
ఏంది రా అయ్య ఈ అరాచకం?.పైగా ఆమ్లెట్ వేస్తున్న షర్ట్
అగ్రహారం బడిత్య లాగా ఎంటి ఆ ఏషలు
నీ ఏజ్ ఎంటి
కింద గేజ్ ఎంటి..జై కొల్లి ఆగదు నాలొల్లి pic.twitter.com/KR43aoGYsk
— KOLLI DURGA VARA PRASAD (@hopekolli_babu) March 31, 2024