Prabhas : 2023 లో ప్రభాస్ చాలా జాగ్రత్తగా ఉండాలి .. దారుణం జరగబోతోంది .. వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు !

Advertisement

Prabhas ప్రస్తుతం సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అయితే చాలామంది సెలబ్రిటీల మీద చేసే వ్యాఖ్యలు ఎవరు నమ్మడం లేదు. కొంతకాలానికి అవి నిజమవుతాయని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. నాగచైతన్య సమంత, రామ్ చరణ్ ఉపాసన, విజయ దేవరకొండ లాంటి సెలబ్రిటీల విషయంలో నేను చెప్పినవి కచ్చితంగా

Advertisement

జరుగుతాయని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పుకొచ్చారు.2023 లో ప్రభాస్ కు దారుణ పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రభాస్ గురించి కీలక విషయాలను చెప్పారు. 2023లో ప్రభాస్ ఎదురుకాబోయే సమస్యలను గురించి సంచలన విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రభాస్ ఆరోగ్యం ఎలా ఉంటుందని యాంకర్ అడగగా, దానికి బదులిస్తూ నేను సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి చెప్పను కానీ జాతక రీత్యా వారి లైఫ్ ఎలా అఫెక్ట్ అవ్వ పోతుందో మాత్రం చెప్పగలను.

Advertisement
venu swamy comments about prabhas
venu swamy comments about prabhas

గతంలో సెలబ్రిటీల విషయంలో నేను చెప్పినవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ విషయంలో జరుగుతాయి. ప్రభాస్ జీవితంలో చాలా అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అలాగే సినిమాల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ప్రభాస్ ది వృశ్చిక రాశి అని అర్ధాష్ఠమ శని, ఒకవైపు అష్టమ గురువు, మరోవైపు గురువులు ఉండటంతో రాబోయే సంవత్సరం ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు వేణుస్వామి . దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement
Advertisement