
Venu Swamy : మరో 10 నెలల్లో మెగా ఇంట్లో వారసుడు జన్మిస్తాడు... వేణు స్వామి సంచలన కామెంట్స్...!
Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వైరల్ అయిన వ్యక్తి వేణు స్వామి.ఇక ఈ వేణు స్వామి తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఎంతగానో నమ్ముతారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు సైతం వేణు స్వామి అంటే తెలిసే ఉంటుంది. ఇక ఈ వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన మాటలు నిజం కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఎక్కువ రోజులు కలిసి ఉండరని ,త్వరలోనే వారిద్దరు విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ఒకానొక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వేణు స్వామి ఇలా చెప్పినప్పుడు అక్కినేని అభిమానులు ఆయనపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత నిజంగానే సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరు ఊహించిన విధంగా ఫాన్స్ కు షాక్ ఇచ్చారు.దీంతో వేణు స్వామి ఒక్కసారిగా వైరల్ అయ్యారని చెప్పాలి.
ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామి దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకోవడం , పరిహారాలు చేపించుకోవడం, పూజలు చేపించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి తెలుగు పరిశ్రమలలో బాగా ఫేమస్ అయ్యారు.అయితే అన్ని సందర్భాలలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయి అంటే వాస్తవం కాదనే చెప్పాలి.పలు రకాల సెలబ్రిటీల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు విఫలమయ్యాయి. ఇక అప్పటినుండి వేణు స్వామి పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. అయినప్పటికీ వేణు స్వామి క్రేజ్ మాత్రం అలాగే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కూడా ఇప్పటికీ వేణు స్వామిని సంప్రదిస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వేణు స్వామి పలు రకాల టీవీ షోలలో కూడా కనిపిస్తున్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.అయితే ఇలా వేణు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్స్ లో ఎవరో ఒక సెలబ్రిటీ గురించి ఖచ్చితంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీంతో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మెగాస్టార్ ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరో 10 నెలల్లో కుమారుడు జన్మిస్తాడు అంటూ… మెగా ఇంటికి వారసుడు వస్తాడంటూ..వేణు స్వామి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. అయితే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు నిజం అవుతాయో లేదో తెలియదు కానీ ఈ న్యూస్ నిన్న మెగా అభిమానులు మాత్రం అదే జరగాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వారసుడు పుట్టాలని వారి వంశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వంశోద్ధారకుడు జన్మించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇదే ఇంటర్వ్యూలో వేణు స్వామి అల్లు అర్జున్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.