Venu Swamy : కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు..!

Venu Swamy : తెలుగు సినీ ఇండస్ట్రీలో జ్యోతిష్యం, జాతకాల గురించి తరచూ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ మృతికి మహేశ్ బాబు జాతకమే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1995 నుంచి కృష్ణ ఇంట్లో పూజలు నిర్వహించానని, కానీ తన నిజాయితీతో జాతకాలను చెప్పడం వల్లే ఆ కుటుంబం తనను పూజలకు పిలిపించడం మానేసిందని ఆయన వెల్లడించారు.

Venu Swamy కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు

Venu Swamy : కృష్ణ మృతికి మహేషే కారణం అంటూ వేణు సంచలన వ్యాఖ్యలు..!

Venu Swamy  ప్రాణం పొసే మహేష్ బాబు.. తండ్రి ప్రాణం తీస్తాడా.? వేణు స్వామి పై ఫ్యాన్స్ నిప్పులు

విజయ నిర్మల ఆరోగ్య పరిస్థితిపై 2020 తర్వాత వారి ఇంట్లో మరణాలు సంభవిస్తాయని చెప్పిన కారణంగా, తనను ఇంట్లోకి ఆహ్వానించకపోయారని ఆయన పేర్కొన్నారు. వేణు స్వామి తన జ్యోతిష్య విశ్లేషణలో మహేశ్ బాబు గ్రహస్థితి గురించి మాట్లాడారు. మహేశ్ బాబు సింహరాశి వారు కావడంతో 2020 నుంచి శని గ్రహం మార్పులు ఆయన కుటుంబంపై ప్రభావం చూపాయని చెప్పారు. జనవరి 16 తర్వాత మహేశ్ తల్లిదండ్రుల జీవితాల్లో ఏదో ఒక అనర్థం జరుగుతుందని తాను గ్రహించానని, ఆ ప్రభావం కృష్ణ గారి మృతిపై పడిందని చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారింది.

అయితే ఈ అభిప్రాయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది పూర్తిగా సంఖ్యా, గ్రహగతుల ఆధారంగా చెప్పిన జ్యోతిష్య భావన మాత్రమే. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మహేశ్ బాబు కుటుంబం ఇప్పటికే వరుస విషాదాలతో బాధపడుతుంటే, ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది