Venkatesh : నిర్మాత దగ్గుబాటి రామానాయుడి గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆయన ఒక బడా నిర్మాత మాత్రమే కాకుండా మంచి నటుడు. నిర్మాత సురేశ్ బాబు, హీరో విక్టరీ వెంకటేశ్‌కు తండ్రి. అంతేకాకుండా సురేశ్ ప్రొడక్షన్ అధినేత కూడా. ప్రస్తుతం ఆయన జీవించి లేరు.అయితే, ఆయన చివరి కోరిక తీర్చలేదని విక్టరీ వెంకటేశ్ నేటికి తలుచుకుంటూ బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీ.. రామానాయుడి ఫ్యామిలీ చాలా పెద్దది.
దీంతో అక్కినేని నాగేశ్వరరావు గారు తన కుమారుడు నాగార్జునకు నిర్మాత రామానాయుడి కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లితో ఇరు కుటుంబాల మధ్య బంధం ఏర్పడింది. అయితే, నాగచైతన్య పుట్టాక నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి రామానాయుడి కుటుంబంతో బంధం తెంచుకోవాలని నాగ్వేశ్వరరావుకు అస్సలు ఇష్టం లేదు. అందుకే లక్ష్మికి విడాకులు ఇవ్వొద్దని కొడుకుతో వారించాడని ఇండస్ట్రీలో కొంతకాలం టాక్ నడిచింది. తండ్రి మాట వినకుండా నాగ్ రెండో పెళ్లి చేసుకున్నాక కొంతకాలానికి రామానాయుడు కూడా తన కూతురికి రెండో పెళ్లి జరిపించి విదేశాలకు పంపించాడు.
ఇక తన చెల్లెను మోసం చేశాడని విక్టరీ వెంకటేశ్ తన బావ నాగార్జున మీద కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రామానాయుడు చివరి రోజుల్లో పాత పగలు పక్కన పెట్టి నాగార్జునతో కలిసి మెలిసి ఉండాలని.. ఇద్దరు కలిసి సినిమాలు చేయాలని పలుమార్లు ప్రస్తావన తెచ్చాడట. కానీ వెంకటేశ్ మాత్రం దానికి ససేమీరా ఒప్పుకోలేదని తెలిసింది. తన సోదరిని మోసం చేసిన వాడితో సినిమాలు చేయనని వెంకీ కరాఖండీగా చెప్పడంతో రామానాయుడు చాలా బాధపడ్డారని తెలిసింది.ఇక కొంతకాలానికి ఆయన మరణించాడు.కానీ వెంకీ మాత్రం తన తండ్రి కోరిన కోరికను తీర్చలేదని అప్పుడప్పుడు గుర్తుచేసుకుని బాధపడుతుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.