Venkatesh : తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయానని కుమిలిపోతున్న విక్టరీ వెంకటేష్..!

Authored By mallesh | The Telugu News | Published on: October 19, 2022, 4:30 pm

Venkatesh : నిర్మాత దగ్గుబాటి రామానాయుడి గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆయన ఒక బడా నిర్మాత మాత్రమే కాకుండా మంచి నటుడు. నిర్మాత సురేశ్ బాబు, హీరో విక్టరీ వెంకటేశ్‌కు తండ్రి. అంతేకాకుండా సురేశ్ ప్రొడక్షన్ అధినేత కూడా. ప్రస్తుతం ఆయన జీవించి లేరు.అయితే, ఆయన చివరి కోరిక తీర్చలేదని విక్టరీ వెంకటేశ్ నేటికి తలుచుకుంటూ బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని ఫ్యామిలీ.. రామానాయుడి ఫ్యామిలీ చాలా పెద్దది.

దీంతో అక్కినేని నాగేశ్వరరావు గారు తన కుమారుడు నాగార్జునకు నిర్మాత రామానాయుడి కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లితో ఇరు కుటుంబాల మధ్య బంధం ఏర్పడింది. అయితే, నాగచైతన్య పుట్టాక నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి రామానాయుడి కుటుంబంతో బంధం తెంచుకోవాలని నాగ్వేశ్వరరావుకు అస్సలు ఇష్టం లేదు. అందుకే లక్ష్మికి విడాకులు ఇవ్వొద్దని కొడుకుతో వారించాడని ఇండస్ట్రీలో కొంతకాలం టాక్ నడిచింది. తండ్రి మాట వినకుండా నాగ్ రెండో పెళ్లి చేసుకున్నాక కొంతకాలానికి రామానాయుడు కూడా తన కూతురికి రెండో పెళ్లి జరిపించి విదేశాలకు పంపించాడు.

Victory Venkatesh said that he could not fulfill his father last wish

Victory Venkatesh said that he could not fulfill his father last wish

Venkatesh : రామానాయుడి చివరి కోరిక ఎంటంటే..

ఇక తన చెల్లెను మోసం చేశాడని విక్టరీ వెంకటేశ్ తన బావ నాగార్జున మీద కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రామానాయుడు చివరి రోజుల్లో పాత పగలు పక్కన పెట్టి నాగార్జునతో కలిసి మెలిసి ఉండాలని.. ఇద్దరు కలిసి సినిమాలు చేయాలని పలుమార్లు ప్రస్తావన తెచ్చాడట. కానీ వెంకటేశ్ మాత్రం దానికి ససేమీరా ఒప్పుకోలేదని తెలిసింది. తన సోదరిని మోసం చేసిన వాడితో సినిమాలు చేయనని వెంకీ కరాఖండీగా చెప్పడంతో రామానాయుడు చాలా బాధపడ్డారని తెలిసింది.ఇక కొంతకాలానికి ఆయన మరణించాడు.కానీ వెంకీ మాత్రం తన తండ్రి కోరిన కోరికను తీర్చలేదని అప్పుడప్పుడు గుర్తుచేసుకుని బాధపడుతుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp