Home » Entertainment » Vignesh Shivan In Nayanthara Mother Birthday Event
Entertainment

Nayanthara : అత్తగారింట్లో విఘ్నేశ్ శివన్.. వేడుకల్లో నయనతార స్పెషల్ అట్రాక్షన్!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 16, 2021 8:05 am
Advertisement

Nayanthara నయనతార Nayanthara విఘ్నేశ్ శివన్ Vignesh Shivan వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. కనీసం ఈ బంధం అయినా పెళ్లి పీటల వరకు వెళ్తుందా? అని అందరూ సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇది వరకు నయనతార కు ప్రేమలో పెద్ద గుణపాఠాలు జరిగాయి. శింబు, ప్రభుదేవా వంటి వారితో పీకల్లోతు ప్రేమలో మునిగి.. బయటకు వచ్చింది. ఇక ముచ్చటగా మూడో సారి విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడింది. నాను రౌడీదానే అనే చిత్రంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌.. హీరోయిన్ నయనతారను పడగొట్టేశాడు.

Advertisement

Vignesh Shivan In Nayanthara Mother Birthday Event

నయన్ తల్లి బర్త్ డే.. Nayanthara

అలా అక్కడి నుంచి వీరి వ్యవహారం చర్చకు దారి తీస్తూనే ఉంది. ఈ జంటపై ఎన్నో రూమర్లు వచ్చాయి. విడిపోయారు.. పెళ్లి క్యాన్సిల్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని అన్నారు. కొన్ని సార్లు బ్రేకప్ కూడా జరిగిందంటూ రాసేశారు. అలా ఈ జంటపై కొన్ని వేల వార్తలు వచ్చాయి. కానీ వాటిని అంతే స్పీడులో తిప్పి కొట్టేశారు. నయనతారకు సోషల్ మీడియాలో ఖాతాలు లేవు. ఎక్కువ యాక్టివ్‌గా కూడా ఉండదు.

Advertisement

 

Vignesh Shivan In Nayanthara Mother Birthday Event

Advertisement

నయనతార  విషయాలన్నీ కూడా విఘ్నేశ్ శివన్ షేర్ చేస్తుంటాడు. అలా ఇప్పుడు నయనతార  అమ్మ కురియన్ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఇక విఘ్నశ్ తన అత్తగారింటికి అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల్లో వెళ్తుంటాడు. ఇక నయన్ తల్లి, తన అత్తగారికి విఘ్నేశ్ స్పెషల్ విషెస్ చెప్పాడు. ఈ వేడుకల్లో నయన్ హైలెట్ అవుతోంది. నయన్ లుక్కు, చిరునవ్వును చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మొత్తానికి నయన్ ఫ్యాన్స్‌కు మాత్రం కన్నులపండువగా ఉంది.

 

Vignesh Shivan In Nayanthara Mother Birthday Event

 

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి