Nayanthara – Vignesh : సౌత్ హీరోయిన్లలో తన అందం, అభినయం, నటనతో అత్యధికంగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నయన్ తార నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో చిన్నచితకా పాత్రల్లో నటించిన నయన్.. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోయిలతోనూ నటించింది. తన నటనకు తోడు లక్కు కూడా కలిసి రావడంతో తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేసింది. అగ్రహీరోలతో నటిస్తూ వారికి కూడా గట్టిపోటీనిచ్చింది. అంతేకాకుండా లేడి ఒరియెంటెడ్ పాత్రలు చేసిన నయన్ తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకుంది.
నయనతార తెలుగులో బడా హీరోలు అందరితోనూ యాక్ట్ చేసింది. మొట్టమొదటి సారిగా తెలుగులో రూ.4కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె నటించిన చిత్రాలు చాలా మేరకు హిట్ కావడంతో నయన్ ఈ మేరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. దీనికి తోడు సీనియర్ హీరోలతో పోటీ పడి యాక్ట్ చేసేవారిలో నయన్ మినహా పెద్దగా ఎవరూ కనిపించకపోవడంతోనూ ఈ బ్యూటీకి నిర్మాతల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో నయన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చిన్న సినిమాలను కూడా నయన్ ఒప్పుకోవడం లేదని, భారీ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందని టాక్.
ఇటీవల తన ప్రియుడు, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లిచేసుకున్న నయన్ తార చెన్నైలో తన భర్త కోసం రూ.20కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసి అతనికి గిఫ్టుగా ఇచ్చిందని కూడా వార్తలు వినిపించాయి. అయితే, తన భర్త విఘ్నేశ్ చేసిన పనికి నయన్ తార హాస్పిటల్‌లో చేరిందట.. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. వీకెండ్‌లో నయన్ కోసం తన భర్త ఓ స్పెషల్ రెసిపీని చేసి పెట్టాడట. అది కాస్తా బెడిసికొట్టడంతో నయన్‌కు ఫుల్ వామిటింగ్స్ అయ్యాడని తెలిసింది. అంతేకాకుండా స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ రావడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందని తెలుస్తోంది. కొన్ని గంటలు నయన్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆమె రికవరీ కాగానే డిశ్చార్జి చేసినట్టు కథనాలు వస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.