Vijay Devarakonda – Rashmika Mandanna : యువ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని టాలీవుడ్ ఓపెన్ టాక్. ఇద్దరు తమ మధ్య ఏమి లేదని పైకి చెబుతున్నా సరే ఇద్దరు కలవాల్సిన టైం లో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ కనిపిస్తూ షాక్ ఇస్తుంది. ఇక లేటెస్ట్ గా న్యూ ఇయర్ పార్టీలో కూడా ఇద్దరు కలిసి రచ్చ చేసినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కలిసి మాల్దీవ్స్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నట్టు టాక్.
విజయ్, రష్మిక ఇద్దరు విడివిడిగా తమ ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ లు చేశారు. అది చూస్తే ఇద్దరు మాల్దీవ్స్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది. విజయ్ తో రష్మిక రిలేషన్ షిప్ లో ఉంది అనడానికి ఈ ఫోటోలు ఒక ఉదహరణగా చెప్పుకోవచ్చు. తమ ప్రతి వేడుకలో విజయ్, రష్మిక ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పైకి మాత్రం వారిద్దరి మధ్య ఏమి లేదన్నట్టు చెప్పుకొస్తున్నారు. మరి వీరిద్దరి ఈ సీక్రెట్ రిలేషన్ షిప్ ని బ్రేక్ చేసి అందరికి ఎప్పుడు చెబుతారో చూడాలి.

ఓ పక్క బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రష్మిక విజయ్ తో ఈ సీక్రెట్ రిలేషన్ షిప్ పై నోరు విప్పట్లేదు. విజయ్ కూడా రష్మికతో వచ్చే కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తాడు తప్ప అసలు రెస్పాండ్ అవడు. మరి వీరిద్దరు మరోసారి న్యూ ఇయర్ కలిసి సెలబ్రేట్ చేసుకోగా ఇప్పటికీ మేమిద్దరం స్నేహితులమే అని చెప్పినా నమ్మక తప్పదు. విజయ్, రష్మిక వీరి రిలేషన్ షిప్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నది అందరు ఎదురుచూస్తున్నారు. వారిద్దరి ఫ్యాన్స్ కూడా ఈ రూమర్స్ పై కన్ ఫ్యూజ్ అవుతున్నారు.
View this post on Instagram