విజయ్ దేవరకొండ సినిమాకి అలాంటి బ్యాక్ డ్రాప్ కథ సెట్ చేస్తే ప్రభాస్ ని మించిపోతాడు ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

విజయ్ దేవరకొండ సినిమాకి అలాంటి బ్యాక్ డ్రాప్ కథ సెట్ చేస్తే ప్రభాస్ ని మించిపోతాడు ..?

విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విపరీతంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండ ఛరిష్మానే మార్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో అందరికీ ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. స్టార్ హీరోల జాబితాలో సెటిల్ అయ్యాడు. ఆ తరువాత వరుసపెట్టి హిట్ సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు యూత్ మెచ్చిన స్టార్ విజయ్ దేవరకొండ. సింప్లిసిటీ, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తనకు నచ్చినట్లు ఉండే ఈ […]

 Authored By govind | The Telugu News | Updated on :18 January 2021,8:24 pm

విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విపరీతంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సినిమా విజయ్ దేవరకొండ ఛరిష్మానే మార్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో అందరికీ ఆల్ టైమ్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. స్టార్ హీరోల జాబితాలో సెటిల్ అయ్యాడు. ఆ తరువాత వరుసపెట్టి హిట్ సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు యూత్ మెచ్చిన స్టార్ విజయ్ దేవరకొండ. సింప్లిసిటీ, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తనకు నచ్చినట్లు ఉండే ఈ యంగ్ స్టార్ అంటే పడిపోని అమ్మాయి లేదనే చెప్పాలి. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకులు విజయ్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న లేటెస్ట్ మూవీ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ లైగర్ తో పాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సాలా క్రాస్ బ్రీడ్ అన్నది క్యాప్షన్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ విజయ్ కాంబోలో సినిమా చేయబోతున్నట్లు అందులోనూ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.

vijay devarakonda exceeds prabhas with such back drop story is set

vijay devarakonda exceeds prabhas with such back drop story is set

అయితే విజయ్ దేవరకొండ తో సుకుమార్ చేయబోతున్న కథ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన సమయంలో నెలకొన్న అప్పటి పరిస్థితుల ఆధారంగా ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. పాక్, ఇండియా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ గెలుపు కోసం ఓ జవాన్ చేసే సాహసోపేతమైన పోరాటాన్ని చూపించేదిగా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. పాన్ ఇండియా సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ప్రభాస్ రేంజ్ కి రావడం పక్కా అంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది