Home » Entertainment » Vijay Devarakonda Liger Movie Failure Reasons
Entertainment

Liger Movie : ‘లైగర్‌’ ను నిండా ముంచిన ఆ మూడు విషయాలు

Authored By
aruna
The Telugu News | Published on: August 26, 2022, 8:20 pm
Advertisement

Liger Movie : విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. దాదాపుగా 95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన లైగర్ సినిమా కనీసం 30 నుండి 35 కోట్ల వసూళ్లను అయినా రాబడుతుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో లైగర్ ను మొదటి రోజు బాగానే చూశారు. మొదటి రోజు షేర్‌ 10 కోట్ల ఉండటంతో ఆది వారం ముగిసే వరకు ఒక ముప్పై కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. కానీ లాంగ్ రన్ లో కూడా ఆ మొత్తం రాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లైగర్‌ కి చాలా పెద్ద నష్టం తప్పక పోవచ్చు అంటున్నారు.

Advertisement

ఇదే సమయంలో లైగర్ సినిమా యొక్క పోస్ట్‌ మార్టం ను ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు చేస్తున్నారు. వారు చర్చించుకుంటున్న దాని ప్రకారం ఈ సినిమా లోని మూడు విషయాల కారణంగా సినిమా దెబ్బ తిన్నది. ఆ మూడు విషయాలు లైగర్ ను నిండా ముంచాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ మూడు విషయాల విషయంలో దర్శకుడు నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే లేదా మరో రకంగా నిర్ణయాలను తీసుకుని ఉంటే తప్పకుండా మంచి ఫలితం ను లైగర్‌ సినిమా దక్కించుకునేది అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

vijay devarakonda liger movie failure reasons

Advertisement

లైగర్ సినిమా లో హీరో పాత్రకు నత్తి ని పెట్టడం ను చాలా పెద్ద మైనస్ అంటున్నారు. అలా నత్తి ఉండటం వల్ల విజయ్ దేవరకొండ అభిమానులు ఆయన మార్క్ డైలాగ్స్ ను మిస్‌ అయ్యారు. ఇక రెండవ విషయానికి వస్తే ఈ సినిమా లో మైక్ టైసన్ పాత్ర. ఒక అంతర్జాతీయ స్టార్ ఆయన.. అలాంటి వ్యక్తిని అద్భుతమైన పాత్రలో చూపించాలి. కానీ పూరి ఆయన్ను ఒక జోకర్ గా చూపించడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. ఇక మూడవది పాటల ప్లేస్ మెంట్‌.. సెంటిమెంట్‌ సీన్ రాగానే ఐటెం సాంగ్‌ పెట్టిన పూరి మార్క్ స్క్రీన్‌ ప్లే ను అంతా కూడా తిట్టుకుంటున్నారు. ఈ మూడు కారణాల వల్ల లైగర్ దెబ్బ తిన్నది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి