Home » Entertainment » Vijay Devarakonda Liger Movie Remuneration And Acting
Entertainment

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ కోసం చాలా వదిలేశాడట.. ప్రతిఫలం దక్కేనా!

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2022, 8:20 pm
Advertisement

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ పూరి జగన్నాద్‌ ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో రూపొందించిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయి లో ఈ సినిమా ను గత నెల రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. సినిమా ను కావాల్సినంతగా ప్రమోట్‌ చేయడంతో ప్రేక్షకులు అంతా కూడా ఇప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా ను చూద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దర్శకుడు పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ చాలా విషయంలో సహకరించాడు. ఆయన కాకుండా మరే హీరో కూడా ఈ సినిమా లోని ఆ సన్నివేశాలకు ఒప్పుకునే వారు కాదేమో. ఒక స్టార్‌ హీరో అనే ఇమేజ్ ను పక్కన పెట్టి సిగ్గు పడకుండా కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ నటించాడు అంటూ పూరి పేర్కొన్నాడు. చాలా వరకు సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండ మొహమాటం వదిలేశాడు. కొన్ని సన్నివేశాలను తన హీరోయిజంను పక్కన పెట్టాడు అంటూ పూరి మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ చెప్పి సినిమా పై మరింతగా అంచనాలు పెంచుతున్నారు.

Vijay Devarakonda liger movie remuneration and acting

Advertisement

లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పారితోషికం విషయం లో త్యాగం చేసిన విషయం తెల్సిందే. సినిమా కు ఎక్కువ బడ్జెట్‌ అవ్వడం తో పారితోషికం లో తగ్గించుకుని లాభాల్లో వాటాను తీసుకునేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం చాలా సన్నివేశాల్లో హీరోయిజం ను వదిలేశాడు.. పారితోషికం తగ్గించుకున్నాడు. ఇంతగా త్యాగం చేసిన విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా తో ప్రతిఫలం దక్కేనా అనేది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి