vijay devarakonda shares intresting facyt
Vijay Devarakonda: ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. అనన్య పాండే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఆగస్ట్ 25న విడుదల కానున్నఈ సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ముంబై నుంచి ఇండోర్ వరకు విజయ్ దేవరకొండ, అనన్య పాండేకు ప్రేక్షకులు, సినిమా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల వరంగల్‌లో కూడా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు చేస్తున్నారు.
లైగర్ సినిమా తల్లి, కొడుకు మధ్యలో చాలా ఎమోషనల్‌గా సాగనుండగా, దీని గురించి చెబుతూ తాను కాలేజ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలు పరిచయం అయ్యేవారు. అప్పుడు ఆఫర్స్ రాత్రిలోనే ఉండేవి. ఇలా మాట్లాడుతున్న సమయంలో మా అమ్మ చూసి నా ఫోన్ తీసుకుంది. కొట్టలేదు కాని తిట్టి ఫోన్ తీసేసుకుందని విజయ్ చెప్పాడు. ఇక లైగర్ చిత్రంలో తన తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిన లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఈ సినిమాకు అన్ని ప్రాతాల్లో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. పలు ప్రాంతాల్లో ప్రారంభమైన అడ్వాన్సు బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. అమెరికాలో 160 లొకేషన్లలో 480 షోల ద్వారా 86K డాలర్లు వసూలు చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. అది అలా ఉంటే విడుదల సందర్భంగా ట్విట్టర్ ఇండియా లైగర్ ఏమోజీని విడుదల చేసింది. అయితే ఇలా గతంలో తెలుగులో ప్రభాస్, మహేష్‌ల తర్వాత విజయ్ సినిమాకు ఇలా రావడం పట్ల రౌడీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.