Namrata:మహేష్ సోదరి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆమె అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపించి సందడి చేసింది.ఆమె గురించి తాజాగా నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నమ్రత మాట్లాడుతూ..‘లైఫ్ ఇలాగే ఉండాలని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నిజానికి నేను ఎయిర్ హోస్టెస్ కావాలని అనుకున్నాను. కానీ విమాన ప్రమాదాలు జరుగుతాయని అమ్మ భయపడింది. తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టాను. పెళ్లి తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యాను. దానికి నాకేం బాధ లేదు. ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది. అందుకని మరో ప్రయత్నం చేయబోతున్నాను. టీవీ రంగంలో నిర్మాణంలోకి అడుగు పెట్టబోతున్నాను. దానికి సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాను. ఆ పనుల్లో బిజీగా ఉన్నాను’’ అన్నారు.
మంజుల గురించి మాట్లాడుతూ..’ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ అయ్యాం. తను నా బెస్ట్‌ఫ్రెండ్. అంతేకాదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీని ధరించడం యాధృచ్చికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం మొదట్లో ఇష్టమే లేదు. కానీ ఇప్పుడో కూతురు. తల్లిగా ఆమె ఎంతో ఆనందిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. నమ్రత ప్రస్తుతం మహేష్ వ్యవహారాలతో పాటు పిల్లల బాగోగులు కూడా చూసుకుంటుంది.
1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.చూస్తుంటే నమ్రత రానున్న రోజులలో కూడా వెండితెరపై కనిపించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణ రంగంలోనే ఆమె కొనసాగాలని అనుకుంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.