Rashmika Mandanna : రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న..!!
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ లవ్ బర్డ్స్ అని సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలుసు కదా. టాలీవుడ్ లోని రష్మిక ఛలో సినిమాతో అడుగు పెట్టినా.. గీత గోవిందం సినిమా తనకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఒకే ఒక్క సినిమాతో రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇద్దరి పెయిర్ సూపర్ అనిపించింది. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. తర్వాత ఇద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలోనూ నటించారు.
vijay deverakonda and Rashmika Mandanna in dubai for vacation
అప్పటి నుంచే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. వాళ్ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందని.. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. విదేశాల్లోనూ ఇద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తమ అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా…. వాళ్ల మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. తాజాగా మరోసారి వెకేషన్ కు వెళ్లి అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు.
vijay deverakonda and Rashmika Mandanna in dubai for vacation
Rashmika Mandanna : మొన్న మాల్దీవుల్లో.. ఇవాళ దుబాయ్ లో
ఇటీవల వాళ్లు మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసినట్టు ఫోటోలు లీకయ్యాయి. తాజాగా.. దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో ఉన్న ఎడారిలో ఇద్దరూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లినట్టున్నారు అని అభిమానులు అనుకుంటున్నారు. అంతే కాదు.. విజయ్ కూడా తన ఇన్ స్టాలో దుబాయ్ కి వెళ్లినట్టు వీడియో షేర్ చేశాడు. దీంతో అబ్బా.. ఇద్దరూ కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
