Ranabali Movie : భర్త విజయ్ దేవరకొండ మీద ఎంత ప్రేమ తల్లీ నీకు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 11 August 2026, 9:00 pm
  •  Ranabali Movie విజయ్ దేవరకొండ ‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 30న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే సమాచారం, రష్మిక గాయం, సినిమా కథపై పూర్తి వివరాలు.

Ranabali Movie : విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం పూర్తి చేసి ఉంటే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే షూటింగ్, ఇతర నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం ఏర్పడటంతో ఆ రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో సెప్టెంబర్ 11న విజయ్ దేవరకొండ సినిమా కాకుండా ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ‘రణబాలి’ కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా? అని విజయ్ అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సమాధానం దొరికినట్టేననే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ 30న ‘రణబాలి’ని వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Ranabali Movie : భర్త విజయ్ దేవరకొండ మీద ఎంత ప్రేమ తల్లీ నీకు..!

Ranabali Movie : భర్త విజయ్ దేవరకొండ మీద ఎంత ప్రేమ తల్లీ నీకు..!

Ranabali Movie రష్మిక గాయం.. ‘రణబాలి’ షూటింగ్‌పై ప్రభావం?

‘రణబాలి’లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నకు ఇటీవల షూటింగ్ సమయంలో గాయమైన సంగతి తెలిసిందే. ‘మైసా’ సినిమా షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైద్యులు ఆమెకు దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.అయితే ‘రణబాలి’లో రష్మికకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే చాలావరకు పూర్తయినట్లు సమాచారం. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ సీన్లు ఉంటే, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత వాటిని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన భార్య కమ్ హీరోయిన్ రష్మిక విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరోవైపు రష్మిక కూడా గాయం కారణంగా ఎక్కువ కాలం షూటింగ్‌కు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో, ఆరోగ్యం సహకరించిన వెంటనే వీలైనంత త్వరగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికే చిత్రబృందం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 30ను ఖరారు చేస్తే సినిమాకు అనుకూలంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే అక్టోబర్ మొదటి రెండు మూడు వారాల్లో ఇప్పటికే పలు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’, ఏకే 47, రజనీకాంత్ ‘జైలర్ 2’, ధనుష్ నటిస్తున్న ‘ఓం’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు క్యూ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా అక్టోబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ 16ను పరిశీలిస్తున్నారనే టాక్ కూడా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో భారీ సినిమాలతో నేరుగా క్లాష్ కాకుండా ‘రణబాలి’ని అక్టోబర్ 30న సోలో రిలీజ్ చేయడం బడ్జెట్ పరంగా కూడా సేఫ్ ఆప్షన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే చివరి నిర్ణయం మాత్రం చిత్రబృందం తీసుకోవాల్సి ఉంది.

Ranabali Movie రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ దేవరకొండ ‘రణబాలి’

‘రణబాలి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంగా సాగే ఈ కథలో స్వాతంత్ర్యం రాకముందు జరిగిన పోరాటంలో ఒక వీరుడు చేసిన యుద్ధాన్ని ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. అయితే ఇది సాధారణంగా మనం చూసే ఫ్రీడమ్ ఫైట్ కథల తరహాలో ఉండదని తెలుస్తోంది. ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని దర్శకుడు ఆవిష్కరించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

విజయ్ దేవరకొండ కెరీర్‌లో ‘రణబాలి’ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.ఇద్దరి కాంబినేషన్‌కు ఇప్పటికే ఉన్న క్రేజ్‌కు తోడు.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, పీరియాడిక్ యాక్షన్ కథ, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వంటి అంశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పుడు అక్టోబర్ 30 రిలీజ్ డేట్ నిజంగానే లాక్ అవుతుందా? లేదా మరో తేదీకి మారుతుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp