Jason Sanjay : తండ్రి గురించి ఫైనల్ గా మాట్లాడాడు .. CM విజయ్ కొడుకు ఏమన్నాడో చూడండి..!
Jason Sanjay : దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న జాసన్ సంజయ్ తొలి ఇంటర్వ్యూలో తండ్రి విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెట్టైక్కారన్ షూటింగ్ జ్ఞాపకాలు, డ్యాన్స్, తన కెరీర్‌పై చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్ కుటుంబానికి సంబంధించిన విషయాలు గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకవైపు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు మీడియా, సోషల్ మీడియాలో చర్చకు వస్తుండగా, మరోవైపు ఆయన కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా కోలీవుడ్‌లో అడుగుపెడుతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘సిగ్మా’ ప్రస్తుతం చిత్రీకరణ, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా జాసన్ సంజయ్ తొలిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, తండ్రి విజయ్ నుంచి నేర్చుకున్న విషయాలు, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jason Sanjay : తండ్రి గురించి ఫైనల్ గా మాట్లాడాడు .. CM విజయ్ కొడుకు ఏమన్నాడో చూడండి..!
‘వెట్టైక్కారన్’ పాట గుర్తుందా?.. ఆ షూటింగ్ ఇప్పటికీ మర్చిపోలేదు
చిన్నప్పుడే జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘వెట్టైక్కారన్’ లోని “నా అదిచ్చా తాంగ మట్టే” పాటలో కనిపించారు. ఆ పాటలో విజయ్‌తో కలిసి ఒకే తరహా దుస్తులు ధరించి డ్యాన్స్ చేసిన చిన్నారి జాసన్ అప్పట్లో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో అదే పాట గురించి ప్రశ్నించగా జాసన్ ఆసక్తికరంగా స్పందించారు. “నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ సహజంగా రాదు. అది ప్రాక్టీస్‌తో వచ్చే విషయం. ఇంట్లో సరదాగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి కొంచెం డ్యాన్స్ చేస్తాను అంతే” అని చెప్పారు. దీనిపై యాంకర్ స్పందిస్తూ, “మీకు డ్యాన్స్ రాకపోవడం ఎలా సాధ్యం? అది మీ రక్తంలోనే ఉంది. మీకు ఐదు శాతం వచ్చినా చాలానే” అని వ్యాఖ్యానించగా, జాసన్ నవ్వుతూ…”దయచేసి నన్ను ఆయనతో పోల్చొద్దు” అని వినయంగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
“నాకు నచ్చిన దారిలో వెళ్లమని నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు.
‘వెట్టైక్కారన్’ సినిమా షూటింగ్ రోజులను కూడా జాసన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
“ఆ పాటలో నేను ఎలా నటించానో ఇప్పుడు పూర్తిగా గుర్తు లేదు. కానీ మేము అక్కడికి వెళ్లి కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. ‘యాక్షన్’ అన్న వెంటనే వెళ్లి నాన్నను కౌగిలించుకున్నాను. అప్పుడు నా వయసు ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు నేను దర్శకత్వం వహిస్తున్న సమయంలో కూడా ఆ షూటింగ్ జ్ఞాపకాలు తరచూ గుర్తుకు వస్తుంటాయి” అని చెప్పారు. ఇక తన తండ్రి విజయ్ నుంచి జీవితంలో నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటని అడిగితే, జాసన్ ఎంతో భావోద్వేగంగా సమాధానం ఇచ్చారు. “నాకు నచ్చిన పని చేయడానికి మా నాన్న ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నేను నా సొంత గుర్తింపు సంపాదించుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించారు. అదే ఆయన నుంచి నేర్చుకున్న గొప్ప విషయం” అని వెల్లడించారు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని కూడా జాసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జాసన్ సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ అభిమానుల మధ్య కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తండ్రి విజయ్‌పై ఆయన వ్యక్తం చేసిన గౌరవం, తన సొంత మార్గాన్ని ఎంచుకోవాలన్న ఆలోచన అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సిగ్మా’ పై కూడా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆసక్తి మరింత పెరిగింది.







