Superstar Krishna : విజ‌య నిర్మ‌ల – ఇందిరా దేవి ఇద్ద‌రిలో ఎవ‌రంటే కృష్ణ‌కు ఎక్కువ ఇష్టం.. ఆయ‌న చ‌నిపోయాక బ‌య‌ట‌ప‌డ్డ నిజం…!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 15, 2022, 5:40 pm

Superstar Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ర‌ణ‌వార్త విని ఆయ‌న అభిమానుల‌కు ఒక్క‌సారిగా గుండె ఆగినంత ప‌ని అయింది. ఆయ‌న మ‌ర‌ణాన్ని సినీ ఇండ‌స్ట్రీతో పాటు కృష్ణ అభిమానులు, మ‌హేశ్ బాబు అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ మృతితో ఒక్క‌సారిగి సినీలోకం దిగ్భ్రాంతికి లోన‌యింది. చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కృష్ణ ఇవాళ ఉద‌యం 4 గంట‌ల‌కు క‌న్నుమూశారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూనే ఆయ‌న మ‌ర‌ణించారు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందుల‌తో పాటు గుండె పోటు రావ‌డం వ‌ల్ల ఆయ‌న మృతి చెందిన‌ట్టు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

దీంతో కృష్ణ ఫ్యామిలీ శోక‌సంధ్రంలో మునిగిపోయింది. ఇక‌.. కృష్ణ అంత్య‌క్రియ‌లు రేపు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు సూప‌ర్ స్టార్ ఫ్యామిలీని మ‌ర‌ణాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే కృష్ణ ఫ్యామిలీలో ముగ్గురు చ‌నిపోయారు. ఇప్పుడు కృష్ణ కూడా చ‌నిపోవ‌డంతో కృష్ణ అభిమానులు చాలా బాధ‌ప‌డుతున్నారు. కృష్ణ పెద్ద‌కొడుకు ర‌మేశ్ బాబు చ‌నిపోవ‌డం అంత‌కుముందే కొన్నేళ్ల ముందు విజ‌య నిర్మ‌ల చ‌నిపోవ‌డం, ఇటీవ‌ల ఆయ‌న మొద‌టి భార్య ఇందిరా దేవీ చ‌నిపోవ‌డంతో కృష్ణ చాలా కుంగిపోయారు. విజ‌య‌నిర్మ‌ల చ‌నిపోయినా కృష్ణ కోలుకున్నారు కానీ.. ఎప్పుడైతే ఇందిరా దేవీ చ‌నిపోయారో ఇక కృష్ణ త‌ట్టుకోలేక‌పోయారు. కృష్ణ‌కు విజ‌య‌నిర్మ‌ల క‌న్నా ఇందిరా దేవి అంటేనే ఇష్టం.

Vijaya Nirmala and Indira Devi who is Superstar Krishna favorite

Vijaya Nirmala and Indira Devi who is Superstar Krishna favorite

Superstar Krishna : కృష్ణ‌కు ఇందిరా దేవి అంటేనే ఇష్ట‌మా?

దానికి కార‌ణం.. ఆయ‌న మొద‌టి భార్య కావ‌డం, కోరుకొని పెళ్లి చేసుకోవ‌డం. ఇందిరా దేవిని కృష్ణ ఇష్ట‌ప‌డి మ‌రీ పెళ్లి చేసుకున్నారు. కానీ.. సినిమాల్లోకి వెళ్లాక విజ‌య నిర్మ‌ల మీద ఇష్టం పెంచుకున్నారు. విజ‌య నిర్మ‌ల మీద ఇష్టం పెంచుకొని పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ.. ఇందిరా దేవి మీద ఉన్న త‌న ఇష్టం, ప్రేమ మాత్రం త‌గ్గ‌లేదు. విజ‌య‌నిర్మ‌ల క‌న్నా కూడా కృష్ణ‌కు ఇందిరా దేవి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చ‌నిపోయాక‌నే కృష్ణ మ‌రింత కుంగిపోయారు. త‌న‌లో తానే బాధ‌ప‌డ్డారు. చాలా బాధ‌ప‌డ్డారు. అలా ఆయ‌న ఆరోగ్యం మ‌రింత దిగ‌జారింది. చివ‌ర‌కు ఇందిరా దేవి చ‌నిపోయిన కొన్ని రోజుల‌కే ఆయ‌న కూడా మంచం ప‌ట్టి తుదిశ్వాస విడిచారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp