
Viral News in Lady Pushpa cunning who kidnapped the merchant's son
Viral News: సాధారణంగా కొందరు మహిళలు అమాయకంగా నటిస్తూ ఎదుటివారి జీవితాలకు ఎసరు పెడుతుంటారు. అటువంటి కోవలోకి వస్తుంది పుష్ప అనే మహిళ. తనకు తాను ఓ ఐఏఎస్ అధికారి పీఏను అని ఓ వ్యాపారి కొడుకును నమ్మించింది.అతనితో నాలుగు రోజులు బాగానే మాట్లాడింది. ఆ తర్వాతే తనలోని కన్నింగ్ బుద్దిని బయటపెట్టింది. ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తానని నమ్మించింది. అతన్ని పలానా చోటుకు వస్తే డీల్ గురించి మాట్లాడుకుందామని పిలిచి ఏకంగా గుండాలతో కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
రవి ఇండస్ట్రియల్ సప్లై యాజమని రవి కొడుకు సూరజ్.. ఇతనికి పుష్ప ఓ రోజు మెసేజ్ చేసింది. సూరజ్ తన తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. అతనికి వద్ద డబ్బులు బాగానే ఉంటాయని అనుకున్న పుష్ప అతన్ని నెమ్మదిగా మాటల్లోకి దింపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తానని చెప్పి రమ్మని.. కిడ్నాప్ చేయించింది. అనంతరం అతని తండ్రికి కాల్ చేసి రూ.నాలుగు కోట్లు ఇస్తే మీ కొడును విడుదల చేస్తామని.. లేదంటే చంపేస్తామని బెదిరించింది. తన దగ్గర అంత డబ్బు లేదని అతని తండ్రి చెప్పాడు. అనంతరం సూరజ్ తన ఫ్రెండ్ గురుమూర్తికి ఫోన్ చేసి డబ్బులు తీసుకుని రమ్మన్నాడు. గురుమూర్తి రూ. 25లక్షలు తీసుకుని పుష్ప రమ్మన్న చోటుకు వెళ్లాడు.
Viral News in Lady Pushpa cunning who kidnapped the merchant’s son
అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి గురుమూర్తి పుష్పకు కాల్ చేశాడు. అనంతరం సూరజ్‌ను పుష్ప తన ఇంటికి తీసుకువచ్చి డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరించింది.ఈ క్రమంలోనే గురుమూర్తి పుష్పకు మళ్లీ కాల్ చేశాడు. దీంతో పుష్ప తన ఇంటి అడ్రస్ చెప్పడంతో గురుమూర్తి రూ. 25 లక్షలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. పుష్ప రాత్రి 9గంటల టైంలో సూరజ్‌ను విడిచిపెట్టింది. బయట ఎవరికైనా చెబితే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. అంతేకాకుండా మీ ఇంట్లో వారందరినీ చంపేస్తానని బెదిరించడంతో సూరజ్ సైలెంట్ అయ్యాడు. కానీ ఎలాగోలా ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు చాకచక్యంగా ఆమె అరెస్టు చేశారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.