Meena : మీనా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ అమ్మడు సుపరిచితం. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే మీనా నిజానికి మద్రాస్ లో పుట్టి పెరిగింది. తమిళనాట సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా కూడా తొలుత తమిళ పరిశ్రమలోనే అడుగు పెట్టింది.అయితే ఇటీవల ఆయన భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే. . కరోనా కారణంగా వచ్చిన ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మీనా భర్త చనిపోయినట్లు తెలుస్తోంది. భర్త మృతి చెందిన విషాదంలో నిండిపోయిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. మీనాను పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు.
అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. మీనా అవయువ దానం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మీనా వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండేది. ఇక సినిమాలకు స్వస్తి చెప్పిన తర్వాత మీనా విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి పెద్దలు కుదర్చగా వీరికి నైనిక అనే కూతురు ఉంది. నైనికా సైతం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. విద్యాసాగర్ తో మీనా పెళ్లికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.
సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీనాకి అమె తల్లి రాజమల్లిక అనేక పెళ్లి సంబంధాలను చూసిందట. అయితే మీన మేనత్త విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవాలని వారికి ఒక మీటింగ్ అరేంజ్ చేసిందట. అయితే విద్యాసాగర్ అభిప్రాయాలు తన అభిప్రాయాలు వేరుగా ఉండటం అలాగే వృత్తులు కూడా కలవకపోవడంతో అతడికి నో చెప్పేసింది. దాంతో ఎంతో వినయంగా ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడట విద్యాసాగర్. కానీ మీనా మేనత్త ఆమెను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించిందట. విద్యాసాగర్ లాంటి వ్యక్తిని కోల్పోతే జీవితంలో మళ్ళీ అలాంటి అబ్బాయిని పొందలేవని గట్టిగా చెప్పిందట. దాంతో మరోమారు కలిసి మాట్లాడి విద్యాసాగర్ తో పెళ్లికి ఓకే చెప్పిందట. అలా విద్యాసాగర్‌తో మీనా పెళ్లి జరిగింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.