Vishnu Priya : విష్ణు ప్రియకి పెద్ద జలక్ ఇచ్చిన పృథ్వీ.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!
Vishnu Priya : బిగ్ బాస్ సీజన్ 8 Bigg Boss Telugu 8 మరి కొద్ది రోజులలో ముగియనున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. ప్రేక్షకుల అటెన్షన్ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ టూ ఫినాలే టాస్క్ కోసం బిగ్ బాస్ కొత్త ప్లాన్ వేశాడు. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న సెలబ్రిటీలను ఈ టాస్క్ లు ఆడించడానికి రంగంలోకి దింపుతున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఫైనల్ రేసుకు వెళ్ళబోయే ఫస్ట్ కంటెస్టెంట్ ను సెలక్ట్ చేయడానికి కంటెండర్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజా ఎపిసోడ్ లోకి అఖిల్ తో పాటు హరిక కూడా ఎంటర్ అయ్యారు. వాళ్లను చూసి వైల్డ్ కార్డులు కావొచ్చునని కంటెస్టెంట్స్ భయపడిపోయారు.
Vishnu Priya : విష్ణు ప్రియకి పెద్ద జలక్ ఇచ్చిన పృథ్వీ.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!
వచ్చి రావడంతోనే విష్ణుప్రియను టార్గెట్ చేశాడు అఖిల్. ఫోర్స్‌ఫుల్ రిలేషన్స్ కరెక్ట్ కాదని, వాటిని వదిలేసి ముందుకు వెళితేనే జర్నీ బాగుంటుందని విష్ణుప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్‌పై కామెంట్స్ చేశాడు. ఓ పర్సన్ మీద ఇష్టం ఉందని అన్నాను…కానీ అది ప్రేమ అని…మరోటి అని నేను ఎక్కడ చెప్పలేదంటూ అఖిల్‌పై విష్ణుప్రియ కౌంటర్ వేసింది. నేను నాలానే ఉంటూ వస్తోన్నానని అన్నది.విష్ణుప్రియ తో లవ్ ట్రాక్‌పై పృథ్వీ ఒపినియన్ అడిగింది హారిక. విష్ణుప్రియ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, ఈ రిలేషన్స్ నాకు సెట్ కావంటూ పృథ్వీ క్లారిటీ ఇచ్చాడు. ఇదే విషయం చాలా సార్లు విష్ణుప్రియతో చెప్పానని అన్నాడు.నాకు ఇష్టమైన వాళ్లను పైన పెట్టడం నాకు ఇష్టం అంటూ అఖిల్‌తో వాదించింది విష్ణుప్రియ. నా బిహేవియర్ నచ్చితే ఆడియెన్స్ నాకు ట్రోఫీ ఇస్తారు. వాళ్లకు నేను నచ్చలేదంటే ఇక్కడ ఉండను అంటూ అఖిల్‌తో వాదనకు దిగింది.
కంటెండర్ టాస్క్ కోసం రోహిణి, గౌతమ్ లను సెలక్ట్ చేసుకున్నారు అఖిల్, హారిక. ఇక వారిద్దరు మరో ఇద్దరినిసెలక్ట్ చేసుకోవాలి. అయితే వారు తేజ, విష్ణు లను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వారిలో గెలుపుతో పాటు.. సరిగ్గా ఆడకపోతే.. బ్లాక్ స్టార్ ఇస్తారు.దాంతో ఈ కంటెండర్ షిప్ టాస్క్ నుంచి వైదొలగాల్సి ఉంది. అయితే తాజా ఎపిసోడ్ లో రెండు టాస్క్ లు జరిగాయి. ఆ రెండు టాస్క్ లలో రోహిణి విన్ అయ్యింది. వీరితో పాటు ఆడిన వారిలో విష్ణు ప్రియ ఆటలో లోపం ఉందని బ్లాక్ స్టార్ ను విష్ణు కు ఇచ్చారు అఖిల్ , హారిక. అంతే కాదు విష్ణు పెద్దగా ఎఫర్ట్ పెటట్టకుండా యూనివర్సల్ కబుర్లు చెప్పడంతో వారికి ఆమెపై నమ్మకం కూడా పోయింది. మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంటూ వస్తున్న విష్ణు ఒకేసారి ఏడ్చేసింది. ఆమె కూల్ గా కనిపించినా… కళ్ళ వెంట నీళ్ళు మాత్రం ధారాపాతంగా కారడం కనిపించింది. అఖిల్ కూడా వెళ్ళూ..వెళ్తూ.. మనసులో పెట్టుకోవద్దు.. ఇంకా స్ట్రాంగ్ గా ఆడు అనిచెప్పి వెళ్ళారు అఖిల్ , సో విష్ణు ప్రియను పృధ్వీతో పాటు నబిల్, నిఖిల్, గౌతమ్ కూడా ఓదార్చారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.