Bigg Boss Telugu 8 : ఊహించని ఎలిమినేషన్.. వెళుతూ గౌతమ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన లేడి కంటెస్టెంట్..!
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : ఊహించని ఎలిమినేషన్.. వెళుతూ గౌతమ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన లేడి కంటెస్టెంట్..!
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో ముగియనుంది. అయితే ప్రతి వారం కూడా హౌజ్ నుండి ఒకరు వెళ్లిపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. అసలు అంతా యష్మి టాప్ 5 లోకి వస్తుంది అని అనుకున్నారు. కాని యష్మి ఇలా వెళ్ళిపోవడం చాలామందికి షాక్ ఇచ్చింది. రెండు మూడు వారాలు గా యష్మి, నిఖిల్ కు సబంధించిన వివాదం.. ఆమెపై బాగా నెగెటివిటీని తీసుకువచ్చింది.
Bigg Boss Telugu 8 ఊహించని ఎలిమినేషన్..
అంతే కాదు బయట నుంచి హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు.. ఈ వారం నామినేషన్స్ లో యష్మిని గట్టిగా టార్గెట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న యష్మి, ప్రేరణ, నిఖిల్, పృధ్వీ. నబిల్, లలో శనివారం నిఖిల్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేరణ, నబిల్ సేవ్ అవ్వగా.. ఆతరువాత యష్మి ఎలిమినేట్ అయ్యి,.. పృధ్వీ సేవ్ అయ్యాడు. ఇక వెళ్తూ వెళ్తూ.. యష్మి చాలా తెలివిగా సమాధానాలు చెప్పింది. జర్నీ చూసిన తరువాత ఇంట్లో ఎవరు ఫ్రెండ్స్ నీకు ఎవరు ఎనిమీస్ అని బోర్డ్ మీద ఫోటోలు పెట్టమన్నారు నాగ్. గతంలో విష్ణుపై నెగెటీవ్ గా మాట్లాడి.. పృధ్వీకి దూరం చేసిన ఆమె.. ఇప్పుడు తమ కే బ్యాచ్ లోకి విష్ణుని కూడా తీసుకుంది. బోర్డ్ పైన ఫ్రెండ్స్ గా పెట్టిన వారిలో విష్ణు ప్రియా తప్పించి అందరు కన్నడ బ్యాచ్ కావడం విశేషం.
నిఖిల్, గౌతమ్ లలో ఎవరి మీద బిగ్ బాంబ్ వేస్తావు అని అడిగితే గౌతమ్ మీద అని చెప్పింది యష్మి. అది కూడా బిగ్ బాంబ్ ఒక నామినేషన్ పడినట్టు లెక్క. నిఖిల్ ఆల్ రెడీ ఈ వీక్ నామినేట్ అయ్యి.. సేవ్ అయ్యాడు. సో గౌతమ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో లేడు కాబట్టి.. ఈవీక్ నామినేట్ చేస్తున్నా అని యష్మి చెప్పింది. దాంతో గౌతమ్ ఫేస్ లో మార్పు కనిపించింది. అలా వెళ్తూ.. వెళ్తూ.. కామ్ గా గౌతమ్ పై తన పగను తీర్చుకుంది యష్మి. పన్నెండో వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయింది. దాంతో పదిమంది వరకు ఉన్న ఇంటి సభ్యులు ఇప్పుడు 9 మందే మిగిలారు. ప్రస్తుతం హౌజ్‌లో యష్మీ ఎలిమినేషన్‌తో నబీల్, అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.