VishnuPriya : నా మూడ్ ఇంకా అలానే ఉంది.. విష్ణుప్రియ మామూల్ది కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

VishnuPriya : నా మూడ్ ఇంకా అలానే ఉంది.. విష్ణుప్రియ మామూల్ది కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :6 July 2022,8:00 pm

VishnuPriya : విష్ణుప్రియ బుల్లితెరపై ఇప్పుడు హడావిడి తగ్గించింది. సోషల్ మీడియా రచ్చ చేయడం మాత్రం తగ్గించడం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది.వర్కవుట్ వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక రీల్ వీడియోలతో విష్ణుప్రియ చేసే సందడి మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఆమె తన ఫిట్ నెస్ కోసం చేసే వర్కవుట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇక రీల్ వీడియోలంటూ పొట్టి బట్టల్లో విష్ణుప్రియ చేసే డ్యాన్సులు అయితే అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తుంది. తాజాగా విష్ణుప్రియ ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. అందులో తన ఎద అందాలను బయటపెట్టేసింది.

భారీ అందాలు బయటపడటంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. క్లీ వేజ్ షో చేసిన విష్ణుప్రియ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అలా విష్ణుప్రియ నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు. యూట్యూబ్ చానెల్ ద్వారా విష్ణుప్రియ బాగానే సంపాదిస్తోంది. వెరైటీ వీడియోలు చేసుకుంటూ వ్లాగ్స్ అంటూ విష్ణుప్రియ అక్కడ కూడా బాగానే రాబడుతోంది. ఇక ఇన్ స్టాలో యాడ్స్ రూపంలోనూ బాగానే సంపాదించేస్తోంది. అందుకే ఎక్కువగా బుల్లితెరపై కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కోణంలో విష్ణుప్రియ ఆలోచిస్తోంది.

VishnuPriya shares beautiful quotes

VishnuPriya shares beautiful quotes

ఈషా ఫౌండేషన్ కార్యక్రమాలకు వెళ్తోంది. సద్గురు కోట్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా విష్ణుప్రియ అలాంటి ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. మన మైండ్‌కు ఆల్రెడీ ఓ విషయం గురించి తెలుస్తుంది. కానీ అది అంగీకరించేందుకు మన మనసు ఒప్పుకోదు.. కాస్త టైం తీసుకుంటుంది అని ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. అవును నిజమే నిన్నటి నుంచి నా మూడ్ కూడా అలానే ఉందని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. అంటే ఏదో బాధ కలిగించే విషయం విష్ణుప్రియకు ఎదురైందన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ బాధ ఏంటో మరి. మొత్తానికి విష్ణుప్రియ త్వరలోనే వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది