
Vishwak Sen : గట్టిగా ఇచ్చి పడేసిన విశ్వక్ సేన్.. మా సినిమాని లేపమనలేదు,అభినందించమని మాత్రమే అన్నా
Vishwak Sen : కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటాడు విశ్వక్ సేన్.ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటూ ఎదుగుతూ వస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ ఇటీవలి కాలంలో హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన చిత్రం గామి. ఇటీవల విడుదలైన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంది ఆదరణ లభిస్తుంది. ఇక మూవీలో విశ్వక్ సేన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీ బాగా వచ్చిందని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతేకాదు దర్శకుడు విద్యాధర్ కగితకు, హీరో విశ్వక్‍పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది.. మార్చి 8న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.20కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ప్రయోగాత్మక మూవీగా ఈ చిత్రానికి ఆడియన్స్ మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. అయితే, సెలెబ్రిటీలు పెద్దగా ఈ చిత్రం గురించి మాట్లాడకపోయేసరికి విశ్వక్ సేన్ హర్ట్ అయ్యాడు. తన చిత్రానికి ప్రముఖుల నుండి పెద్దగా మద్దతు లభించలేదని భావించిన విశ్వక్ సేన్.. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ పరిశ్రమలో గామి లాంటి సినిమా ఇంతకు ముందెప్పుడూ రాలేదని తాను గర్వంగా చెబుతున్నా. ఇది మన తెలుగు సినిమా అని, నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడితే బాగుంటుందని విశ్వక్ అన్నారు.
గామి సినిమా నచ్చని వాళ్లకు కూడా నచ్చుతుందని విశ్వక్ అన్నాడు. కొందరు కన్ఫ్యూజింగ్‌గా ఉందని అంటున్నారు, ఎందుకు వారికి కన్ఫ్యూజ్ అవుతుందో నాకు తెలియడం లేదు. ఇందులో అఘోర క్యారెక్టర్ నేను చేయలేనని అనుకున్నా. కాని మీ కోసం ట్రై చేశా. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో ఇలాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఇది అవుతుంది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత నేను ఈ మాటలు చెబుతున్నానంటే అర్ధం చేసుకోవచ్చు. మా సినిమాని ఆకాశానికి ఎత్తమని నేను అడగలేదు. అభినందమించి మాత్రమే అడిగానంటూ విశ్వక్ అన్నారు. ఇటీవల విడుదలైన ప్రేమలు చిత్రానికి మహేష్ బాబు, రాజమౌళి వంటి ప్రముఖుల మద్దతు లభించింది. తన సినిమాపై ఏ సెలబ్రిటీ కామెంట్ చేయలేదనే విశ్వక్ అలా మాట్లాడి ఉంటాడని భావిస్తున్నారు.
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
This website uses cookies.