Home » Entertainment » Vishwak Sen Funny Comments On Suma
Entertainment

Suma : కత్తిలా ఉన్నావ్.. యాంకర్ సుమపై యంగ్ హీరో కామెంట్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: May 30, 2021, 12:20 pm
Advertisement

Suma యాంకర్ సుమ Suma ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగే. ఆమె ఓ షోను హోస్ట్ చేస్తుందన్నా.. ఈవెంట్‌ను నడుపుతుందన్నా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. మామూలుగా అయితే సుమ అందరి మీద పంచ్‌లు వేస్తుంటారు. సుమ Anchor Suma మీద సెటైర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక్కోసారి కొంత మంది సెలెబ్రిటీలు సుమను కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. అలా తాజాగా పాగల్ టీం క్యాష్ షోలో సందడి చేసినట్టుంది. వచ్చే వారం రానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Suma సుమ మీదే కన్ను వేసిన విశ్వక్ సేన్

Vishwak sen funny comments on Suma

పాగల్ హీరో విశ్వక్ సేన్, హీరోయిన్లు సిమ్రన్ చౌదరి, మేఘ లేక, మహేష్ క్యాష్ షోలోకి వచ్చారు. ఇక ఇందులో సుమను అందరూ కలిసి ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరీ ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ అయితే సుమ మీదే కన్ను వేసినట్టున్నారు. ఏకంగా కత్తిలా ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు. లంగావోణిలో కత్తిలా ఉన్నావ్ అని విశ్వక్ సేన్ అనడంతో సుమ షాక్ అయింది. ఇలాంటివి విని చాలా రోజులు అయిందంటూ సుమ కవర్ చేసేసింది.

Advertisement

ఇక మరో సందర్భంలో సుమ బాగా నచ్చేసిందని అన్నారు. మేఘ లేఖతో ఆన్ లైన్ పెళ్లి చూపులు పెట్టించింది సుమ. ఇందులో విశ్వక్ సేన్ వచ్చాడు. మేఘ లేఖ నీ కంటే నీ అక్కే (సుమ) బాగా నచ్చిందంటూ బట్టర్ పూసే ప్రయత్నం చేశాడు. అలా ప్రతీసారి సుమను టార్గెట్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి