Suma : కత్తిలా ఉన్నావ్.. యాంకర్ సుమపై యంగ్ హీరో కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suma : కత్తిలా ఉన్నావ్.. యాంకర్ సుమపై యంగ్ హీరో కామెంట్స్

Suma యాంకర్ సుమ Suma ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగే. ఆమె ఓ షోను హోస్ట్ చేస్తుందన్నా.. ఈవెంట్‌ను నడుపుతుందన్నా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. మామూలుగా అయితే సుమ అందరి మీద పంచ్‌లు వేస్తుంటారు. సుమ Anchor Suma మీద సెటైర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక్కోసారి కొంత మంది సెలెబ్రిటీలు సుమను కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. అలా తాజాగా పాగల్ టీం క్యాష్ షోలో సందడి చేసినట్టుంది. వచ్చే […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :30 May 2021,12:20 pm

Suma యాంకర్ సుమ Suma ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగే. ఆమె ఓ షోను హోస్ట్ చేస్తుందన్నా.. ఈవెంట్‌ను నడుపుతుందన్నా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. మామూలుగా అయితే సుమ అందరి మీద పంచ్‌లు వేస్తుంటారు. సుమ Anchor Suma మీద సెటైర్లు వేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక్కోసారి కొంత మంది సెలెబ్రిటీలు సుమను కూడా ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. అలా తాజాగా పాగల్ టీం క్యాష్ షోలో సందడి చేసినట్టుంది. వచ్చే వారం రానున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Suma సుమ మీదే కన్ను వేసిన విశ్వక్ సేన్

Vishwak sen funny comments on Suma

Vishwak sen funny comments on Suma

పాగల్ హీరో విశ్వక్ సేన్, హీరోయిన్లు సిమ్రన్ చౌదరి, మేఘ లేక, మహేష్ క్యాష్ షోలోకి వచ్చారు. ఇక ఇందులో సుమను అందరూ కలిసి ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరీ ముఖ్యంగా హీరో విశ్వక్ సేన్ అయితే సుమ మీదే కన్ను వేసినట్టున్నారు. ఏకంగా కత్తిలా ఉన్నావ్ అంటూ కామెంట్ చేశాడు. లంగావోణిలో కత్తిలా ఉన్నావ్ అని విశ్వక్ సేన్ అనడంతో సుమ షాక్ అయింది. ఇలాంటివి విని చాలా రోజులు అయిందంటూ సుమ కవర్ చేసేసింది.

ఇక మరో సందర్భంలో సుమ బాగా నచ్చేసిందని అన్నారు. మేఘ లేఖతో ఆన్ లైన్ పెళ్లి చూపులు పెట్టించింది సుమ. ఇందులో విశ్వక్ సేన్ వచ్చాడు. మేఘ లేఖ నీ కంటే నీ అక్కే (సుమ) బాగా నచ్చిందంటూ బట్టర్ పూసే ప్రయత్నం చేశాడు. అలా ప్రతీసారి సుమను టార్గెట్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది