Home » Entertainment » Viva Harsha Intresting Comments On Shanmukh Jaswanth
Entertainment

Viva Harsha : షణ్ముఖ్ జస్వంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైవా హర్ష..!

Authored By
aruna
The Telugu News | Published on: February 25, 2024, 5:00 pm
Advertisement

Viva Harsha : తెలుగు పరిశ్రమలో యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ లలో ఒకరిగా వైవా హర్ష గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా హర్ష మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ క్రేజ్ తోనే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి కామెడీగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి హర్ష చేసిన వైవా సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఈ సిరీస్ ద్వారా హర్షాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తనదైన కామెడీ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారు. తాను నటించిన వైవా ని ఇంటి పేరుగా మార్చుకొని వైవా హర్షగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు హీరోగా మారి ‘ సుందరం మాస్టర్ ‘ అనే సినిమాలో నటించారు. ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వైవా హర్ష యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

షణ్ముఖ్, నేను మా ఇద్దరి ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అతను నన్ను ఎల్డర్ బ్రదర్ గా ట్రీట్ చేస్తాడు వాడు ఎప్పటికీ నా యంగర్ బ్రదరే. సొంత అన్నదమ్ముల పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓ నాలుగైదు ఏళ్లు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అలా అని అది పెద్ద గ్యాప్ కూడా కాదు. నేను సపరేట్ ఛానల్ పెట్టుకుంటానని, సెపరేట్ వే చూసుకుంటానని చెప్పడం అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి. కానీ ఈరోజు ఆ టీమ్ అంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వైవాలో మేము షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కంటెంట్ ప్రొడక్షన్ టైం నుంచి వాళ్లంతా టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించారు. ఆ తర్వాత ఫ్యూచర్ ఫిలిమ్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ కింద సెట్ అయిపోయారు అని హర్ష చెప్పుకొచ్చారు. ఇక తాజాగా షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఓ అమ్మాయి ఇచ్చిన కంప్లైంటుతో షణ్ముఖ్ సోదరుడని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించారు.

అతని దగ్గర మరో పదహారు గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇక షణ్ముఖ్ పోలీసులతో తీవ్రవాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ సోదరుడు వినయ్ సంపత్ ని కూడా పట్టుకున్నారు. ఇక పోతే వైవా హర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాని ఇద్దరు నిర్మాతలు నిర్మించగా అందులో ఓ నిర్మాతగా రవితేజ ఉన్నారు. రవితేజ ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా పలు సినిమాలలో భాగస్వామ్యం అవుతున్నారు. గతంలో మట్టికుస్తి, చాంగురే బంగారు రాజా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు వైవాహర్ష సుందరం మాస్టర్ సినిమాని గోల్డెన్ మీడియా బ్యానర్ లో సుధీర్ కుర్రుతో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మించారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి