
Waltair Veerayya vs Veera Simha Reddy who wins in the game
Waltair Veerayya Vs Veera Simha Reddy : ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ `వాల్తేర్ వీరయ్య` సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ కు మాస్ రెస్పాన్స్ వస్తోంది.
ఇందులో చిరు కామెడీ, మాస్ యాంగిల్, రవితేజ – చిరు మధ్య సాగే సన్నివేశాలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటుంది ఈ ట్రైలర్. కేవలం 15 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 400 ప్లస్ లైక్స్ ను దక్కించుకుంది. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో థియేటర్లు బద్దలే అని చెబుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇక వీరసింహారెడ్డి ట్రైలర్ కూడా ఇటీవల రిలీజ్ కాగా ఇది కూడా ఎంతగానో అలరిస్తుంది. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ అనిబాలయ్య బాబు అభిమానులు
Waltair Veerayya vs Veera Simha Reddy who wins in the game
పండగ చేసుకునేలా వుంటుందని అన్నారు మేకర్స్. ఇందులో `సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుందేమో కానీ..చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు! “ అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు ఎంతగానో పేలాయి. సాయి మాధవ్ బుర్రా ఈసినిమా ఎలా ఉంటుందో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హింట్ ఇచ్చిపడేశాడు. ఏదేమైన ఈ సంక్రాంతికి రెండు గట్టిగా పోటాపడబోతున్నాయి. ఎప్పుడు సంక్రాంతి బరిలో బాలయ్యకే అదృష్టం కలిసి వస్తుండగా, ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి. కాగా, ఇటీవల విడుదలైన ‘వీరసింహారెడ్డి’కి 14 గంటల్లో కేవలం 5 మిలియన్స్ వ్యూసే దక్కాయి. ఈ రకంగా వీరయ్య క్రేజ్ ఎంతగా ఉందో అందరికి అర్థం అవుతోంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.