Wanted PanduGod Movie : వాంటెడ్ పండు గాడు సాంగ్ లో హీరోయిన్లను చూస్తే పిచ్చెక్కాల్సిందే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Wanted PanduGod Movie : వాంటెడ్ పండు గాడు సాంగ్ లో హీరోయిన్లను చూస్తే పిచ్చెక్కాల్సిందే….!

Wanted PanduGod Movie : ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాలంటే ప్ర‌త్యేక క్రేజ్ ఉంటుంది.అందం అభిన‌యంతో క‌నిపించే హీరోయిన్స్.. పండ్ల‌తో చేసే స‌ర‌సాలు ఇవ‌న్నీ కూడా ఆక‌ట్టుకుంటాయి. ఒక‌ప్ప‌డు బ్లాక్ బ‌స్ట‌ర్లు.. ఎన్నో సూర్ హిట్ చిత్రాలు.. ఆధ్యాత్మిక చిత్రాలు తీసిన రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌స్తుతం సినిమాలు తీయ‌డం లేదు కానీ.. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ మ‌ధ్య‌కాలంలో చాల‌నే సినిమాలు వ‌స్తున్నాయి. ఇటీవల శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ బాబు హీరోగా పెల్లి సంద‌డి సినిమాకు కూడా రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌స్తుతం ఆయన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 August 2022,12:00 pm

Wanted PanduGod Movie : ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాలంటే ప్ర‌త్యేక క్రేజ్ ఉంటుంది.అందం అభిన‌యంతో క‌నిపించే హీరోయిన్స్.. పండ్ల‌తో చేసే స‌ర‌సాలు ఇవ‌న్నీ కూడా ఆక‌ట్టుకుంటాయి. ఒక‌ప్ప‌డు బ్లాక్ బ‌స్ట‌ర్లు.. ఎన్నో సూర్ హిట్ చిత్రాలు.. ఆధ్యాత్మిక చిత్రాలు తీసిన రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌స్తుతం సినిమాలు తీయ‌డం లేదు కానీ.. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ మ‌ధ్య‌కాలంలో చాల‌నే సినిమాలు వ‌స్తున్నాయి. ఇటీవల శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ బాబు హీరోగా పెల్లి సంద‌డి సినిమాకు కూడా రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌స్తుతం ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌లో వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు.

శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ కొంత‌మంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల‌ అబ్బా అబ్బా అబ్బ‌బ్బ.. అనే లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే.. నలుగురు హీరోలకు నలుగురు హీరోయిన్లను జోడించి దర్శకేంద్రుడి స్టైల్ లో హీరోయిన్స్‌ అందాలను క్యాచీగా చూపించాడు దర్శకుడు. ఈ పాట చూస్తే ఖచ్చితంగా రాఘవేంద్రరావు మార్క్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని గుర్తుకు వస్తాయి.

Wanted PanduGod Movie song shooting video on youtube

Wanted PanduGod Movie song shooting video on youtube

రీసెంట్ గా విష్ణుప్రియ ఫ‌స్ట్ లుక్ నాభి న‌డుమందాల‌ను చూపిస్తూ త‌మ‌ల‌పాకులు న‌డుముపై ఉంచ‌డం వంటివి చేసి ఆక‌ట్టుకునేలా చేశారు ద‌ర్శ‌కేంద్రుడు. అయితే ఈ రొమాంటిక్ సాంగ్ ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మేకింగ్ లో చూస్తే ఆయనే హీరోయిన్లకు దగ్గరుండి వారిపై వాటర్ స్ప్రే చేస్తుండటం విశేషం. ఇక ఈ పాటలో సుడిగాలి సుధీర్ జోడిగా దీపికా పిల్లి, వెన్నెల కిషోర్ కి జోడిగా విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ హైలైట్ అవుతున్నాయి. సుధీర్ దీపికాలతో పాటు స‌ప్త‌గిరి-నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి-వాసంతి, వెన్నెల కిషోర్‌-విష్ణుప్రియ‌ జోడిలుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. మీరు చూడ‌కుంటే చూసేయండి మ‌రి…

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది