Home » Entertainment » War Between Allu Arjun And Ram Charan
Entertainment

Ram Charan : అల్లు అర్జున్ , రామ్ చరణ్ కు మధ్య గొడవకు కారణం ఇదే ..??

Authored By
aruna
The Telugu News | Updated on: August 27, 2023 2:57 pm
Advertisement

Ram Charan : అల్లు అర్జున్ రామ్ చరణ్ Ram Charan మధ్య ఎప్పటినుంచో భేదాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా సినిమాలపరంగా వీరిద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చిరంజీవి ఇండస్ట్రీకి పదేళ్లు దూరంగా ఉన్నప్పుడు చరణ్ సినిమా కథల ఎంపిక విషయాల బాధ్యతలను చిరంజీవి అల్లు అరవింద్ చేతిలో పెట్టారు. భిన్న కథలను ఉంటే అవి బన్నీకి సెట్ చేసేవాడు, కథ కాస్త అటు ఇటుగా ఉంటే అవి చరణ్ కి ఓకే చేయించేవారు. అలా చరణ్ చేతికి రావాల్సిన హిట్ సినిమాలు బన్నీ ఖాతాలోకి వెళ్లాయి.

Advertisement

చిరంజీవి కి ఈ విషయం తెలియడంతో రామ్ చరణ్ సినిమా కథలు ఎంపిక బాధ్యతలను తనే తీసుకున్నాడు. అక్కడి నుంచి రంగస్థలం సినిమాతో రాంచరణ్ పై చేయి సాధించాడు. ఆ తర్వాత అలవైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో బన్నీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మళ్లీ చరణ్ త్రిబుల్ఆర్ సినిమాతో పై చేయి సాధించాడు. ఇద్దరు హీరోల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. తాజాగా పుష్ప సినిమాకి బన్నీకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. బన్నీకి చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపిన తీరు బన్నీ రిప్లై ఇచ్చిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

War between Allu Arjun and Ram Charan

Advertisement

జాతీయ అవార్డుపై రామ్ చరణ్ ట్వీట్ వేశారు. అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ కి, బుచ్చిబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి దేవిశ్రీప్రసాద్ కి కలిపి కంగ్రాట్స్ చెప్పారు. అంతేకానీ తనకి బావ అయినా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పలేదు. గుంపులో గోవిందం లాగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు బన్నీ కూడా సింపుల్గా థాంక్యూ అని ఊరుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కెరియర్ మరో మరుపు తిరిగింది అని చెప్పాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి