Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  ఎన్టీఆర్ తొక్కేసాడని అప్పట్లోనే చంద్రమోహన్ చెప్పాడా..? వైరల్ గా మారిన వీడియో

  •  చంద్రమోహన్ ఓల్డ్ వీడియో వైరల్..అందులో ఏముందంటే !!

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రియమైన నటుడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మల్టీ స్టారర్ చిత్రాల్లో కూడా ఆయన తనదైన శైలిలో మెప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, అందాల నటుడు శోభన్ బాబు వంటి వారితో చంద్రమోహన్ మంచి స్నేహాన్ని కొనసాగించారు. అయితే ఈయన ఎన్టీఆర్‌తో సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేశారు. ఇది చాలామంది పరిశ్రమవాసులకే ఆశ్చర్యం కలిగించే విషయం.

Chandra Mohan బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan : ఎన్టీఆర్ తొక్కేసాడని అప్పట్లోనే చంద్రమోహన్ చెప్పాడా..? వైరల్ గా మారిన వీడియో

ఈ అంశంపై గతంలో చంద్రమోహన్ అలీతో జాలీగా అనే కార్యక్రమంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో లో చంద్రమోహన్ మాట్లాడినదని ప్రకారం.. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ‘యాదోంకి భారత్’ అనే మసాలా సినిమాను తమిళంలో ‘నాళై నామధే’ పేరుతో మేజిక్ క్రియేట్ చేసిన ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) సరసన, చంద్రమోహన్ అతని తమ్ముడిగా నటించారు. అదే కథను తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’గా తీసే సమయంలో చంద్రమోహన్‌నే తీసుకోవాలని మొదట పరిశీలించినా, ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను ఆ పాత్రలో నటింప చేయాలని నిర్ణయించారని చెబుతారు. ఈ రెండు రీమేక్ సినిమాలు జూలై 4, 1975న ఒకేరోజు విడుదలయ్యాయి.

ఈ పరిణామం చంద్రమోహన్‌కు పెద్ద నెగటివ్ అనుభూతిని కలిగించింది. బాలకృష్ణను తీసుకోవడాన్ని చూసి చంద్రమోహన్ మనస్థాపానికి లోనై, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి అంతగా ముందుకు రాలేదని భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ – చంద్రమోహన్ కాంబినేషన్‌లో చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. కొడుకు కోసం ఎన్టీఆర్ తనకు అన్యాయం చేసాడని చంద్రమోహన్ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది