NTR vs SVR : అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కు మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? వాళ్ల వల్లనే గొడవలు అయ్యాయా? అప్పుడు ఏం జరిగింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR vs SVR : అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కు మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? వాళ్ల వల్లనే గొడవలు అయ్యాయా? అప్పుడు ఏం జరిగింది?

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2022,11:40 am

NTR vs SVR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్వీఆర్(ఎస్వీ రంగారావు) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరూ లెజెండ్స్. వీళ్లు సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టించారు. అందుకే వీళ్లు ఎన్ని తరాలు మారినా గుర్తుండిపోతారు. ఎన్టీఆర్ హీరోగా అందరికీ గుర్తుండి పోతే.. ఎస్వీఆర్ ఒక విలన్ గా అందరికీ గుర్తుండిపోయారు. అయితే.. కొన్ని సినిమాల్లో ఇద్దరూ తండ్రీకొడుకులుగానూ నటించారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరూ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండేవారు కానీ.. ఎందుకో కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయట. విభేదాలు వచ్చాయట. దీంతో ఇద్దరూ దూరం అయ్యారనే టాక్ అప్పట్లో బాగా నడిచింది.

what are the disputes between senior ntr and sv ranga rao

what are the disputes between senior ntr and sv ranga rao

ఇద్దరి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని, దానికి కారణాలు కూడా ఏంటో మరో లెజెండ్ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు తను రాసిన పుస్తకంలో చెప్పుకొచ్చారు. ఎస్వీఆర్ డబ్బులను అస్సలు లెక్కచేయకపోయేవారట. రూపాయికి అస్సలు విలువను ఇచ్చేవారు కాదట. అదే ఎన్టీఆర్ కు నచ్చకపోయేది అంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. అది అందరికీ తెలిసిందే. చాలామందికి ఆర్థికంగా ఎలా ఉండాలి. డబ్బు ఎలా సేవ్ చేయాలో ఎన్టీఆర్ చెప్పేవారు. చాలామంది నటులు ఎన్టీఆర్ సూచనలను పాటించేవారు. అలా సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన సలహాలు పాటించిన వారిలో శోభన్ బాబు లాంటి వారు కూడా ఉన్నారు.

NTR vs SVR : ఎస్వీఆర్ తో పాటు సావిత్రి కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేవారట

అయితే.. ఎస్వీఆర్, సావిత్రి, వరలక్ష్మి లాంటి వాళ్లు మాత్రం అప్పట్లో విపరీతంగా ఖర్చు పెట్టేవారట. ఒకసారి ఎస్వీ రంగారావు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే దాని కోసం డబ్బులు అవసరం అయి ఎన్టీఆర్ ను అడిగారట. దీంతో నేను నీకు ముందే చెప్పా కదా. ఆర్థికంగా బాగుండాలంటే డబ్బులు ఆదా చేసుకోవాలి. అనవసర ఖర్చులు పెట్టకూడదు అని ఎన్టీఆర్ అనడంతో ఎస్వీఆర్ ఫీల్ అయ్యారట. డబ్బులు అడిగితే అలా మాట్లాడారేంటని అనుకొని అప్పటి నుంచి ఎన్టీఆర్ తో మాట్లాడటం మానేశారట ఎస్వీఆర్. అంతే కాదు.. అప్పటి నుంచి ఎన్టీఆర్ తో ఏ సినిమాలోనూ నటించలేదట. అప్పటి నుంచి వాళ్ల మధ్య దూరం పెరిగినట్టు గుమ్మడి తన పుస్తకంలో రాశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది