Vijay Antony Daughter : 24 గంటల్లో ఇద్దరు స్టూడెంట్స్ మృతి.. విజయ్ ఆంటోనీ కూతురు స్కూల్‌లో ఏం జరుగుతోంది?
Vijay Antony Daughter : విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య వార్తలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చదువుల ఒత్తిడే అని అంటున్నారు. చదువులో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోనే అదే స్కూల్ కు చెందిన మరో విద్యార్థి, మీరా క్లాస్ మెంట్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ స్కూల్ లో ఏం జరుగుతోంది అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
#image_title
ఇప్పటికే ఆ స్కూల్ మీరా ఆత్మహత్యతో వార్తల్లో ఉండగా.. మీరా క్లాస్ మెట్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ స్కూల్ పైనే అందరి ఫోకస్ పడింది. వెంటనే పోలీసులు కూడా ఆస్కూల్ కు చేరుకొని స్కూల్ యాజమాన్యంతో మాట్లాడారు. స్కూల్ మేనేజ్ మెంట్ వివరణ కోరింది. మీరా సూసైడ్ చేసుకున్న 24 గంటల్లోనే మరో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక కూడా ఒత్తిడే ఉన్నట్టు తెలుస్తోంది.
Vijay Antony Daughter : ఒత్తిడిని ఎదుర్కోలేక తనువు చాలిస్తున్న విద్యార్థులు
అసలు ఈ వయస్సులో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి.. చదువు వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఏంటి.. చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతే కానీ.. దాన్ని ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఖచ్చితంగా చదువుల ఒత్తిడే ఉన్నట్టు తెలుస్తోంది.