
what will happen in next episode in karthika deepam serial
Karthika Deepam : కార్తీక దీపం ఈరోజు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి చప్పగా.. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా సీరియల్ లేదని.. ఇంకా ఈ సీరియల్ ను ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్ల నుంచి విపరీతంగా ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. బాబూ డైరెక్టర్ ఇకనైనా ఆ సీరియళ్లను ఆపేయవయ్యా.. అంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేశారు. మోనిత జైలుకు వెళ్లాక కూడా ఇంకా ఈ సీరియల్ ను సాగదీయడం అవసరమా? అని పెదవి విరిచారు.కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సీరియల్ అభిమానుల ఆగ్రహాన్ని గ్రహించిన డైరెక్టర్ సీరియల్ ను పట్టాలకెక్కించాడు. సీరియల్ ను బీభత్సమైన ట్విస్టులను యాడ్ చేశాడు. ముందుగా కార్తీక్ ఫ్యామిలీని అమెరికా పోతున్నట్టుగా చూపించాడు. తర్వాత చివరి నిమిషంలో కార్తీక్ ఫ్యామిలీ అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేయించాడు.
what will happen in next episode in karthika deepam serial
కార్తీక్ ఫ్యామిలీ అమెరికా వెళ్లే రోజే మోనిత జైలు నుంచి విడుదల కావడం.. ఆ తర్వాత తనకు నొప్పులు మొదలవడం.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయి. దీంతో సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది.డెలివరీ నొప్పులతో బాధపడుతున్న మోనితను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కార్తీక్ వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా అని మోనిత పట్టుబడుతుంది. కడుపులో బిడ్డ తలకు పేగులు చుట్టుకున్నాయని.. త్వరగా ఆపరేషన్ చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని భారతి చెప్పినా సరే మోనిత వినకపోవడం.. కార్తీక్ వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానంటూ మొండి పట్టు పట్టడంతో వెంటనే భారతి కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. అసలు విషయం చెబుతుంది. కార్తీక్ రావడానికి ఒప్పుకోడు.అయితే.. ఈ విషయంలో సౌందర్య ఇన్వాల్వ్ అవుతుంది. మోనిత ఏమైపోయినా పర్వాలేదు కానీ.. దాని కడుపులో బిడ్డ ఏం పాపం చేశాడు అంటుంది.
వెంటనే వెళ్లి సంతకం పెట్టు పదా అంటూ కార్తీక్ ను ఆసుపత్రికి తీసుకెళ్తుంది. ఆసుపత్రికి తీసుకెళ్లగానే మోనిత వాళ్లకు షాక్ ఇస్తుంది.ఈ బిడ్డ ఆర్టిఫిషియల్ ఇన్ సెమ్యులేషన్ ద్వారా పుట్టిన బిడ్డ కాదు. సహజంగా కార్తీక్ తో పడుకోవడం వల్ల కలిగిన గర్భం.. అంటూ చెబుతుంది మోనిత. దీంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు. ఆతర్వాత కార్తీక్ ను సౌందర్య ఒప్పించడంతో.. తను సంతకం పెడతాడు.అక్కడితో ఈరోజు సీరియల్ అయిపోతుంది కానీ.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే.. మోనితకు పండంటి మగ బిడ్డ పుడతాడు. దీంతో సౌందర్య చాలా సంతోషిస్తుంది.
what will happen in next episode in karthika deepam serial
తన ఇంటికి వారసుడు వచ్చాడని పండుగ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసి దీప సీరియస్ అవుతుంది. కార్తీక్ కూడా కాస్త కూల్ అవుతాడు. దీపకు ఇద్దరూ బిడ్డలే పుట్టడంతో.. మోనితకు కొడుకు పుట్టి ఆనంద రావుకు వారసుడిని కని ఇస్తుంది. దీంతో కార్తీక్ ఫ్యామిలీలో సౌందర్య, ఆనంద రావు ఖుషీ అవుతారు.
కానీ.. దీప మాత్రం కార్తీక్ తనను మోసం చేశాడని అనుకుంటుంది. దీంతో తను ఇల్లు వదిలి వెళ్లిపోవాలని భావిస్తుంది. పిల్లలను తీసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని దీప అనుకోవడంతో.. కార్తీక్ ఏం చేస్తాడు? సౌందర్య.. దీపను బస్తీకి వెళ్లనిస్తుందా? అనేదే పెద్ద సస్పెన్షన్. అలాగే.. మోనితను, తన కొడుకును సౌందర్య ఇంటికి రానిస్తుందా? అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
This website uses cookies.