Mohan Babu : టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని.. జీవో ను విడుదల చేస్తామని చిరంజీవి టీంకి జగన్ హామీ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ వారు మరియు సోషల్ మీడియా వర్గాల వారు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవి ఏంటి అంటే ఈ సమయంలో మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు.. టికెట్ల రేట్లు విషయంలో ఒక్కరు ఇద్దరు వెళ్లి మాట్లాడడం కాదు మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి మాట్లాడాలి అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చిరంజీవితో పాటు ఎందుకు వెళ్ళలేదు అంటూ మోహన్ బాబు ని కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్య కు ఒక పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సింది. అప్పుడు కచ్చితంగా నీవే ఇండస్ట్రీ పెద్ద అయ్యే వాడివి కదా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి.
చిరంజీవి ఒక్కడే వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయం అవుతుంది. కానీ ఇండస్ట్రీ కి సంబంధించిన విషయం ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ బాబు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆ భేటీ వ్యక్తిగత విషయమేనా మంచు విష్ణు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయము మెగా కాంపౌండ్ కి క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశం తో మంచు ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. వాళ్ళకే తిరిగి విమర్శలు తప్పలేదు. మోహన్ బాబు మరియు మంచు విష్ణు ఇప్పటికైనా ఈగో వదిలేసి ఇండస్ట్రీతో కలిసిపోవాలని.. ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ని గౌరవించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.