
Summer Movies : సినిమాలపై ఎన్నికలు, ఐపిఎల్ ఎఫెక్ట్ పడుతుందా.. సమ్మర్‌లో ఈ సారి సందడి లేనట్టేనా..?
Summer Movies : టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతి, దసరా లేదంటే సమ్మర్‌లో విడుదలై మంచి వినోదం పంచుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.గతేడాది సమ్మర్‌లో మంచి సినిమాలు వస్తాయని ఆశ పెట్టుకోగా, చివరికి ఒక్కరంటే ఒక్క అగ్ర హీరో కూడా రాలేదు. మరి 2024లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సారైనా స్టార్ హీరోలు వస్తారా..ఎలక్షన్స్ దెబ్బకు అందరు సైలెంట్ అవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి మాదిరిగానే సంక్రాంతికి సందడి చాలా ఉంది. హనుమాన్ చిత్రం అన్నింటికన్నా పెద్ద హిట్ కాగా, ఈ మూవీతో పాటు వచ్చిన గుంటూరు కారం , నా సామిరంగ మంచి విజయాలు సాధించాయి. వెంకటేష్ సైంధవ్ మాత్రం పెద్ద దెబ్బ కొట్టింది.
ఇక సమ్మర్ కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ వస్తున్నారు. గామి సినిమాతో సమ్మర్ సందడి మొదలు కాగా,విశ్వక్ సేన్ నటించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ చిత్రంతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిపై ఐపీఎల్ ఎఫెక్ట్ పడుతుందేమోనని కొందరు భావిస్తున్నారు. మార్చి 22 నుండి రెండు నెలల పాటు నాన్‌స్టాప్‌గా ఐపీఎల్ జరగనుంది. దీంతో చాలా మంది సినిమాలకి దూరంగా ఉంటారని, దాని వలన విజయ్ మూవీకి కొంత నష్టం ఏర్పడుతుందని చెప్పుకొస్తున్నారు. ఇక మే 9న విడుదల కావాల్సిన ప్రభాస్ కల్కిపై ఎన్నికల ఎఫెక్ట్ పడుతుంది.
మే 13న తెలంగాణ, ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయని, అందులో కల్కి కూడా ఉంటుందని అంటున్నారు. కల్కి చిత్రం ఆగష్టు 15కి పోస్టుపోన్ అయినట్లు వార్తలు వస్తుండగా, ఆ టైంకి పుష్ప సినిమా రాబోతుంది. రెండు చిత్రాలు ఒకేసారి వచ్చే ఛాన్స్ లేదు. ఐపీఎల్, ఎలక్షన్స్ వలన ఈ దరిదాపుల్లో పెద్ద సినిమాల జాడ కనిపించడం లేదు. మార్చి 29న టిల్లు స్క్వేర్ సినిమా విడుదల కానుండగా, ఈ సినిమా కొద్దో గొప్ప యూత్‌ను థియేటర్స్ వరకు రప్పిస్తుంది. కానీ అప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి కలెక్షన్స్ తక్కువే వస్తాయని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.