
Kavitha : ఎమ్మెల్సీ కవితకి ఊహించని దెబ్బ....!
Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కవిత అరెస్ట్ గురించి పలు వార్తలు రాగా, రీసెంట్‌గా ఆమె ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇటీవల తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని ఇవ్వగా, ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితని కలిసి ధైర్యం చెప్పారు. అయితే కవిత కేసులో ఇప్పుడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీస్ హాజరీ కోర్టుకు బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు.ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులను విచారించనున్నారు. ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరుగుతున్న రోజు జడ్జ్ జస్టిస్ నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ కావటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్ లోని మరో 26 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత రూ. 100 కోట్లు చెల్లించారని ఈడీ ప్రకటించిన విషయం విదితమే.
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాయడం కూడా హాట్ టాపిక్ అయింది. సినిమా క్లైమాక్స్ చేరుకుందని, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని ఆ లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. ఇటీవల ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా, అందులో కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు. ఏది ఏమైన తెలంగాణలో కవిత కేసు హాట్ టాపిక్‌గా ఉన్న నేపథ్యంలో జడ్జి బదిలీ కావడం సంచలనంగా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.