
who is going to shake the box office from tollywood
Tollywood: సినిమా ఇండస్ట్రీకి కొన్ని సీజన్ ఉన్నాయి. సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్‌మస్. ముఖ్యంగా ఈ సీజన్స్‌లో చిన్న, మీడియం భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసేందులు మేకర్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఒకేసారి రెండు మూడు భారీ చిత్రాలను రిలీజ్ చేయడానికి ఒకరికొకరు పోటి పడుతుంటారు. అయితే, కరోనా వేవ్స్ తర్వాత లెక్కలు మారిపోయాయి. అంత ఈజీగా రెండు భారీ చిత్రాలను ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేసేందుకు ఆయా చిత్ర నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. కనీసం 2 వారాలైనా సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ఈ సమ్మర్‌కు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మరి వాటిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసేవరో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఆచార్య: మెగా స్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మెగా మల్టీస్టారర్ మొదలై రెండేళ్ళవుతోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివ నాలుగేళ్ళుగా పనిచేస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో సంగీత, రెజీనా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వనున్నారు. ఈ నెల 24న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్..29న సినిమా రిలీజ్ కానున్నాయి. మొన్నటి వరకు భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ వచ్చాక మాత్రం ఆలోచనలు మారిపోయాయి. అంచనాలను అందుకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయట.
సర్కారు వారి పాట: సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుసగా బ్లాక్ బస్టర్ అందుకుంటున్న సమయంలో నెక్స్ట్ సినిమాగా వస్తున్న సర్కారు వారి పాటకు కరోనా వేవ్స్ బ్రేక్ వేశాయి. పలు వాయిదాల తర్వాత మే 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ బాగానే అంచనాలు పెంచాయి. అయితే, పోకిరి వైబ్స్ అని చెబుతున్న ఈ సినిమాపై కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేశ్ నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాపులను చూస్తున్నాయి. ఆ ప్రభావం ఈ సినిమాపై పడనుందా అని..పోకిరి వైబ్స్ అని జనాలను ట్యూన్స్ చేస్తున్నారా..అవుట్ పుట్ మీద డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు మహేశ్ సినిమా మే లో వచ్చినవేవీ హిట్ సాధించలేదు. అందుకే, ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అని అనుమానాలు న్నాయి కొందరిలో.
who is going to shake the box office from tollywood
ఎఫ్ 3: బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఎఫ్ 2కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ఇది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో సునీల్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో..స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో అలరించబోతున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. అయితే, మన దగ్గర సీక్వెల్ కథలు అంతగా సక్సెస్ సాధించినవి లేవు. బాహుబలి సిరీస్ తప్ప. ఇక ఎఫ్ 2 లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టనర్స్ అంటే బాలీవుడ్‌లో వర్కౌట్ అవుతుందేమో అని గానీ, మన వాళ్ళు ఆదరిస్తారా అనే సందేహాలూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని ఓ టాక్ ఉంది. చూడాలి మరి ఈ మూడు సినిమాలలో ఎవరు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించి నిలబడతారో.
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
This website uses cookies.