Home » Entertainment » Who Is The Best Task For Contestants In Bigg Boss Telugu 7
Entertainment

Bigg Boss Telugu 7 : ఇదేం టాస్క్ బిగ్ బాసూ.. ఆడవాళ్లు అని కూడా చూడకుండా మీద పడి మరీ పిసికేశారు.. ఫైనల్ టాస్క్ ఇంత వయలెంట్‌గానా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 13, 2023, 4:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7 లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో మగ, లేడీ అనే తేడా లేదు. మగ కంటెస్టెంట్లు, ఆడ కంటెస్టెంట్లు అందరూ ఈక్వలే. కానీ.. ఒక్కోసారి ఫిజికల్ టాస్కులో లేడీ కంటెస్టెంట్లు కొంచెం తక్కువగా పర్ ఫార్మ్ చేస్తారు. మగవాళ్లకు ఉన్నంత బలం ఆడవాళ్లకు ఉండదు. అయినా కూడా మగవాళ్లతో కొందరు పోటీ పడి మరీ ఫిజికల్ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హౌస్ లో తొలి కెప్టెన్ గా ప్రశాంత్ అయ్యాడు. కానీ.. ప్రశాంత్ కెప్టెన్ గా సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించడం లేదని బిగ్ బాస్ తన కెప్టెన్సీని వెనక్కి తీసుకుంటాడు. కానీ.. మళ్లీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి మళ్లీ ప్రశాంత్ కు కెప్టెన్సీ ఇస్తాడు బిగ్ బాస్.

Advertisement

మరోవైపు బిగ్ బాస్ ఆటగాళ్లు, పోటుగాళ్లు అనే రెండు టీమ్స్ కు కొన్ని టాస్కులు ఇచ్చాడు. ఇప్పటికే మూడు టాస్కుల్లో ఒక్కో గ్రూప్ గెలిచి సత్తా చాటారు. మరి వీళ్లలో ఎవరు బెస్ట్ అని తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చాడు. అదే హు ఈజ్ ది బెస్ట్. ఆ టాస్క్ లో భాగంగా ఫుట్ బాల్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. కానీ.. ఆ గేమ్ కాస్త ఫిజికల్ అయింది. అసలే లేడీ కంటెస్టెంట్లు కూడా హౌస్ లో ఉండటంతో ఆ గేమ్ కాస్త రివర్స్ అయింది. ఒకరి మీద మరొకరు పడటం, ఆడవాళ్లు అని కూడా చూడకుండా మగ కంటెస్టెంట్లు కూడా మీద పడ్డారు. దీంతో లేడీ కంటెస్టెంట్లు.. మగ కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యారు.

#image_title

Advertisement

Bigg Boss Telugu 7 : పూజ, అశ్వని మధ్య గొడవ

ఇదంతా పక్కన పెడితే అశ్వని, పూజ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ అని పూజ అంటే.. నేను స్ట్రాంగ్ గా కనిపించలేదా అని అంటుంది అశ్వని. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని పూజ అంటే.. గట్టిగా మాట్లాడుకు, హోల్డ్ యువర్ టంగ్ అంటూ.. ఇద్దరూ ఒకరిని మరొకరు తిట్టుకున్నారు. మొత్తానికి హు ఈజ్ ది బెస్ట్ అనే టాస్క్ లో చివరకు ఎవరు గెలిచారో కానీ.. దానికి సంబంధించిన ప్రోమో అయితే తాజాగా విడుదలైంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి