Home » Entertainment » Who Will Get Power Ashtra Aata Sandeep Or Priyanka Jain
Entertainment

Bigg Boss Telugu 7 : బాత్‌రూమ్‌లో దాక్కొని రతిక, శివాజీ ఇద్దరూ ఏం చేశారు.. అంత సీక్రెట్ టాస్క్ ఏంటి.. బిగ్ బాస్ ఎందుకు వాళ్లను సెలక్ట్ చేశాడు?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 9, 2023, 8:40 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. తనను మెప్పించిన వాళ్లు పవరాస్త్ర గెలుచుకోవడానికి కంటెండర్లు అవుతారు అని. ఇప్పటికే ఇద్దరు కంటెండర్లు పవరాస్త్ర కోసం సిద్ధంగా ఉన్నారు. ఆట సందీప్, ప్రియాంక జైన్ ఇద్దరూ పవరాస్త్ర కోసం పోటీ పడబోతున్నారు. కానీ.. మరో ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. అది సీక్రెట్ టాస్క్ ద్వారా. చాలామందికి సీక్రెట్ టాస్కులు ఇచ్చాడు కానీ.. ఎవ్వరూ బిగ్ బాస్ ను మెప్పించలేకపోయారు.

Advertisement

టేస్టీ తేజా, కిరణ్, దామిని, ప్రశాంత్.. ఎవ్వరూ బిగ్ బాస్ ను మెప్పించలేకపోయారు. కానీ.. రతిక, శివాజీ ఈ ఇద్దరు మాత్రమే బిగ్ బాస్ ను మెప్పించగలిగారు. అయితే ఇక్కడ మిగితా హౌస్ మెట్స్ కు వచ్చిన డౌట్ ఏంటంటే.. అందరూ బయట ఆడారు కానీ.. ఈ ఇద్దరు మాత్రం బాత్ రూమ్ లో దాక్కొని సీక్రెట్ గేమ్ ఆడారు. అసలు బాత్ రూమ్ లో సీక్రెట్ టాస్క్ ఆడేంతలా ఏం ఉంటుంది అనేదే అంతుపట్టడం లేదు.సీక్రెట్ టాస్క్ లో వాళ్లు ఎలా గెలిచారో పక్కన పెడితే.. దామిని ఒక వైపు అందరి తలల మీద కోడి గుడ్లు పగులగొడుతుంటే వీళ్లిద్దరూ వెళ్లి బాత్ రూమ్ లో దాక్కుంటారు. ఆమె ఎక్కడ కోడి గుడ్లు పగుల గొడుతుందో అని వీళ్లు వెళ్లి బాత్ రూమ్ లో దాక్కున్నారు కావచ్చు అని అందరూ అనుకున్నారు.

who will get power ashtra aata sandeep or priyanka jain

Advertisement

Bigg Boss Telugu 7 : సీక్రెట్ టాస్క్ లో అందుకే వాళ్లు గెలిచారా?

కానీ.. అసలు మ్యాటర్ ఏంటంటే.. వాళ్లకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్ కు పిలిచినప్పుడే సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇద్దరికీ కాఫీ ఇచ్చాడు. శివాజీ కాఫీ తీసుకొని బయటికి వచ్చాడు. రతికకు ఉడతా ఉడతా ఊచ్ అంటూ చాలా సార్లు అదే పాటను వినిపించాడు. కానీ.. ఇందులో సీక్రెట్ టాస్క్ ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు.

ఏది ఏమైనా.. ఇద్దరూ పవరాస్త్ర కోసం పోటీ పడినట్టే పడి చివర్లో మిస్ అయ్యారు. వాళ్లు ఇద్దరూ అనర్హులు అని తేల్చి పడేశారు ఇతర కంటెస్టెంట్లు. ఇక ఇప్పుడు మిగిలింది ఇద్దరే. వాళ్లు ఆట సందీప్, ప్రియాంకా జైన్. ఈ ఇద్దరిలో పవర్ అస్త్ర ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి