Home » Andhra Pradesh » Chandrababus Arrest Scenes Reminiscent Of Movies
andhra pradesh

Chandrababu : చంద్రబాబు అరెస్టు.. సినిమాలు తలపిస్తున్న సన్నివేశాలు.. వీడియో !!

Authored By
Breaking News
The Telugu News | Updated on: September 9, 2023 8:08 pm
Advertisement

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ వేస్తున్న ఎత్తుగడలకు ప్రతిపక్షాల పునాదులు షేక్ అయిపోతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని శనివారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. నంద్యాలలో ఆయనకు నోటీసులు ఇచ్చి కాన్వాయ్ గుండా అమరావతి సీఐడీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఉదయం నోటీసులు ఇస్తే సాయంత్రానికి అమరావతికి చేరుకోవడం జరిగింది. అమరావతి సీఐడీ కార్యాలయంలో దాదాపు గంటన్నర పాటు చంద్రబాబును విచారించనున్నట్లు సమాచారం.పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబుని కర్నూలు నుండి విజయవాడకు తరలించే క్రమంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చేసారు.

Advertisement

చంద్రబాబు కాన్వాయ్ నీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిలకలూరిపేటలో పరిస్థితి అయితే దాదాపు పోలీసులు చేతుల నుండి చేయి దాటిపోయే విధంగా మారింది. ఒక్కసారిగా జనమంతా చంద్రబాబు కాన్వాయ్ చుట్టూ ముగిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు దారి ఇవ్వాలని సమనయం పాటించాలని.. ఆదేశించటంతో శాంతించారు. ఇదే పరిస్థితి అమరావతి చేరుకునే అంతవరకు మధ్యలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు కాన్వాయ్ గుండా మోటార్ సైకిల్స్ కారులు ద్వారా వెంబడిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

chandrababu arrest scenes reminiscent of movies

Advertisement

చంద్రబాబు అరెస్ట్ అయిన క్రమంలో ఆయన కాన్వాయ్ ప్రజల మధ్య వెళుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూస్తున్న నెటిజన్లు సినిమాలు తలపిస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. రాయలసీమ నేపథ్యం కలిగిన సినిమాలలో ఈ తరహా విజువల్స్ ఒకప్పుడు చూసాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లైవ్ లో చూస్తున్నామని అంటున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి