సమంత, నయనతార ఎందుకు ఇలా చేసినట్టు... ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

సమంత, నయనతార ఎందుకు ఇలా చేసినట్టు… ?

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ ఒకరు టాలీవుడ్ ను ఏలు తుంటే మరొకరు కోలీవుడ్ లో కేక పుట్టిస్తున్నారు. 30 ఏళ్లు దాటినా మూవీస్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. వారే టాలీవుడ్ క్వీన్ సమంత కోలీవుడ్ క్వీన్ నయనతార. ఎవరికి వారే నటన పరంగా, అందం పరంగా ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నారు . వీరు చేసిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద బద్దలు అవ్వాల్సిందే. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్ […]

 Authored By govind | The Telugu News | Updated on :11 December 2020,8:09 am

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ ఒకరు టాలీవుడ్ ను ఏలు తుంటే మరొకరు కోలీవుడ్ లో కేక పుట్టిస్తున్నారు. 30 ఏళ్లు దాటినా మూవీస్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. వారే టాలీవుడ్ క్వీన్ సమంత కోలీవుడ్ క్వీన్ నయనతార. ఎవరికి వారే నటన పరంగా, అందం పరంగా ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నారు . వీరు చేసిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద బద్దలు అవ్వాల్సిందే. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్ అందుకున్నారు. రొమాంటిక్ గానే కాదు అభినయంలోనూ తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. స్టార్ డైరెక్టర్లు సైతం వీరు తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Samantha Ruth Prabhu Shares Stunning New Ear Piercings

ఒకరికి పెళ్లి అయినా క్రేజ్ మాత్రం ఏమీ తగ్గలేదు. మరొకరు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న సినిమాల్లో అవకాశాలు తగ్గలేదు. వారిని సూపర్ స్టార్ హీరోయిన్స్ గా పిలుస్తుంటారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంత క్రేజ్ సంపాదించుకున్న సమంతా నయనతార ఓకే సినిమాలో నటిస్తే ఇంకేమైనా ఉందా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందుకే వీరితో కలిసి విగ్నేష్ శివన్ సినిమా తీయబోతున్నట్లు గత ఏడాది నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. సమ్మర్ లో ప్రారంభించాలి అనుకున్నా కరోనా కారణంగా పోస్ట్ పోన్ పడింది.

Nayanthara to team up with Vijay Sethupathi, Samantha in Vignesh's next |  Nayanthara new movie

ఎట్టకేలకు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అవడంతో దర్శకుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతునట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ లేకుండానే దాదాపు రెండు మూడు వారాల పాటు ముఖ్య నటీనటులతో సినిమా చిత్రీకరించబోతున్నాడట డైరెక్టర్. ఈ మూవీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనుండగా కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. తెలుగు, తమిళం ఈ రెండు భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సమంత, నయనతార లేకుండా షూటింగ్ ప్రారంభించడంలోనే అందరూ అయోమయంలో ఉన్నారట. షూటింగ్ కంటిన్యూ అవుతుందా.. లేక మళ్ళీ ఆగిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

 

 

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది