Sneha Ullal : దానికి ఒప్పుకోలేదని నా బతుకును సర్వ నాశనం చేశాడు.. ఆ స్టార్ హీరోపై స్నేహా ఉల్లాల్ కామెంట్స్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 7 January 2023, 8:20 pm

Sneha Ullal : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఈ ఇండస్ట్రీలో బాగా రాణించాలని అనుకుంటారు. కానీ.. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయ అనేది చాలామందికి తెలియదు. దాని వల్ల కొందరు తన జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. నిజానికి.. చాలామంది హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చి చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెట్ అయ్యారు. కొందరు ఎంతో అందంగా ఉన్నప్పటికీ చివరకు సరైన అవకాశాలు రాక.. అవకాశాలు వచ్చినా అవి హిట్ కాక చివరకు సినిమా కెరీర్ ను ముగించేసుకోవాల్సి వచ్చింది.

అలాంటి హీరోయిన్లలో స్నేహా ఉల్లాల్ ఒకరు. ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా తెలుసు కదా. ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది స్నేహా ఉల్లాల్. నిజానికి తను ముందు బాలీవుడ్ లో పరిచయం అయింది. బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి తన సత్తా చాటింది. అయితే.. కొన్నేళ్ల తర్వాత ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. దానికి కారణం.. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే.. అందరు హీరోయిన్లలా కాకుండా తాను కాంప్రమైజ్ కాలేదని..

why heroine sneha ullal film career ruined

why heroine sneha ullal film career ruined

Sneha Ullal : నేను కాంప్రమైజ్ కాలేదు అంటూ కుండ బద్దలు కొట్టిన స్నేహా ఉల్లాల్

అందుకే కొన్ని అవకాశాలు తనకు దక్కలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహా ఉల్లాల్ చెప్పుకొచ్చింది. నేను సినిమాల కోసం ఏం చేయమన్నా చేయను. దానికి నేను రెడీ కాదు. నాకు కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. నాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నా. కానీ.. కొన్ని కమిట్ మెంట్స్ ఇవ్వాలంటూ నాకు అవకాశాలు వచ్చాయి కానీ.. నా రూల్స్ ను నేను బ్రేక్ చేయాలనుకోలేదు.. అంటూ మిగితా హీరోయిన్స్ అలా చేస్తారు అన్నట్టుగా స్నేహా ఉల్లాల్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp